మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kajal: అదొక ఛాలెంజింగ్‌ ఫేజ్‌.. మా అబ్బాయికి కూడా ఆ విషయం తెలియాలి

ABN, Publish Date - May 05 , 2024 | 04:51 PM

"వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో కాజల్‌(Kajal) సడెన్ గా  పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటనేది చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె 'సత్యభామ’ (Satyabhama)చిత్రంలో నటిస్తున్నారు.

"వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో కాజల్‌(Kajal) సడెన్ గా  పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటనేది చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె 'సత్యభామ’ (Satyabhama)చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం విడుదలకు సిద్ధం కానుంది. ఈ సందర్భంగా ఆమె 'నవ్య'తో’ ముచ్చటించింది. ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

"జీవితాన్ని ఎలా జీవించాలనే విషయంలో చిన్నప్పటి నుంచి నాకు అనేక కలలు ఉండేవి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత వాటి గురించి ఆలోచించే సమయం కూడా లేకుండా పోయింది. ఒక దశలో ఏడాదికి 9 సినిమాలు చేశాను. ఎప్పుడూ బిజీగా ఉండేదాన్ని. నా గురించి నేను ఆలోచించుకోవడానికి కూడా సమయం ఉండేది కాదు. అలాంటి సమయంలో కొవిడ్‌ వచ్చింది. ప్రపంచమంతా స్తంభించిపోయింది. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మా ఆయన నాకు చాలా కాలంగా తెలుసు. కొద్ది కాలం డేటింగ్‌కు వెళ్లాం. ఆ తర్వాత తను బిజినెస్‌లో, నేను నా సినిమాల్లో మునిగిపోయాం. కొవిడ్‌ సమయంలో మళ్లీ మేమిద్దరం కనెక్ట్‌ అయ్యాం. తను వచ్చి మా అమ్మ నాన్నలను అడిగాడు. వాళ్లు కూడా ఒప్పుకున్నారు. పెళ్లయిన ఏడాదికి పిల్లాడు పుట్టాడు. వాడు పుట్టిన మూడు నెలలకు మళ్లీ షూటింగ్‌లకు వెళ్లటం మొదలుపెట్టా. ఇది నా జీవితంలో చాలా ఛాలెంజింగ్‌ ఫేజ్‌ అని చెప్పాలి".



శరీరాకృతిని అదుపులోకి తెచ్చుకోవాలి..
పిల్లాడు పుట్టాక వాడిని వదిలి ఎక్కువ సమయం షూటింగ్‌కు వెళ్లడం చాలా కష్టమనిపించింది. కానీ దానిని సవాల్‌గా తీసుకున్నా. బాబు పుట్టాక ‘ఇండియన్‌-2’, ‘సత్యభామ’ సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నా. ఇవి రెండూ యాక్షన్‌ ఓరియెంటెడ్‌ రోల్స్‌. నా కెరీర్‌లో ఈ తరహా పాత్రలు చేయలేదు. నా శరీరాకృతిని మళ్లీ అదుపులోకి తెచ్చుకోవాలి. యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం ట్రైనింగ్‌ తీసుకోవాలి. ఇలా చాలా కష్టపడ్డాను. నాకు చాలా అవకాశాలు వస్తున్నాయి. కానీ కొన్నింటినే ఎంచుకొంటున్నా. షూటింగ్‌ సమయంలో పిల్లాడికి దూరంగా ఉండాలి. అలాంటప్పుడు నాకు తృప్తి ఇచ్చే పాత్రలు మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నా.


షెడ్యూల్‌ ప్రకారం పనులు జరగకపోతే నాకు చాలా చికాకుగా అనిపిస్తుంది. నేను చాలా క్రమశిక్షణగా ఉంటా. ఉదాహరణకు నా షెడ్యూల్‌ను ఒక వారం రోజులకు ముందే ఫిక్స్‌ చేసుకొంటా. నా పనులన్నిటినీ వాటిలో జాగ్రత్తగా అమర్చుకుంటా.



రకరకాల  పాత్రలు చేయాలని నాకూ ఉంది. నేను నా ఐడెంటిటీని ఎప్పుడూ వదులుకోను. మా అబ్బాయికి కూడా... ‘మా అమ్మ నటి. వర్కింగ్‌ మదర్‌’ అనే విషయం తెలియాలి. అయితే ప్రస్తుతం మాత్రం నా ప్రాధాన్యత మా అబ్బాయి మాత్రమే. యంగ్‌ మదర్స్‌ తమ కోసం కూడా కొంత సమయాన్ని కేటాయించుకోవాల్సి ఉంటుంది. నేను వారంలో కొంత సమయాన్ని నా కోసమే కేటాయించుకొంటా. నేను చాలా ఎమోషనల్‌. కొన్ని విషయాలకు నాకు వెంటనే ఏడుపు వచ్చేస్తుంది. కానీ అదే సమయంలో నేను చాలా స్ట్రాంగ్  కూడా.

మా ఆయన, నేను... మా లైఫ్‌ గోల్స్‌ను ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకొంటూ ఉంటాం. మా కోసం కొంత సమయాన్ని పెట్టుకొంటాం. అప్పుడప్పుడూ డిన్నర్స్‌కు వెళతాం. మా భవిష్యత్తును ముందే ప్లాన్‌ చేసుకొంటాం.

Updated Date - May 05 , 2024 | 04:51 PM