Kajal: అప్పట్లో ఆందోళన ఉండేది కాదు.. ఇప్పుడు భయం వెంటాడుతోంది!
ABN, Publish Date - May 05 , 2024 | 11:35 AM
"పిల్లలు పుట్టిన తర్వాత ఒక మహిళ జీవితంలో రకరకాల మార్పులు వస్తాయి. తన జీవితం మారిపోయిందనే విషయాన్ని ముందు గమనించాలి. దానిని అంగీకరించాలి. ఇదొక పెద్ద సవాల్’’ అని కాజల్ అగర్వాల్ (Kajal) అన్నారు.
"పిల్లలు పుట్టిన తర్వాత ఒక మహిళ జీవితంలో రకరకాల మార్పులు వస్తాయి. తన జీవితం మారిపోయిందనే విషయాన్ని ముందు గమనించాలి. దానిని అంగీకరించాలి. ఇదొక పెద్ద సవాల్’’ అని కాజల్ అగర్వాల్ (Kajal) అన్నారు. కొవిడ్ సమయంలో పెళ్లి, తర్వాత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన మిత్రవింద ప్రస్తుతం నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తూ ముందుకెళ్తుంది. తాజాగా ఆమె 'నవ్య'తో ముచ్చటించింది(Chitchat with Kajal).
అదే నా గిల్ట్ ఫీలింగ్..
పెళ్లి, పిల్లలు పుట్టిన తర్వాత మహిళలో మార్పులు సహజం. వాటిని అంగీకరించాల్సిందే! ఆ తర్వాత పిల్లల అవసరాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వారికి అవసరమైనవి గుర్తుంచుకొంటూ ఉండాలి. ఇవి సహజంగానే కొంత ఆందోళన, ఒత్తిడిని కలిగిస్తాయి. అంతే కాదు... నాకు తెలిసి వర్కింగ్ యంగ్ మదర్స్‌లో కొంత గిల్ట్ ఉంటుంది. పనికి వెళ్లినప్పుడు... బేబీని సరిగ్గా చూసుకోవటం లేదనే గిల్ట్ అది. బేబీతో సమయం గడుపుతున్నప్పుడు... పని ఎగ్గొడుతున్నామనే గిల్ట్. ఈ భావోద్వేగాల సయ్యాటలో ఏర్పడే సందిగ్థత పెద్ద సవాల్‌గా మారుతుంది. నాకేౖతే రోజుకు 24 గంటలు చాలవనిపిస్తోంది!
బలం.. బలహీనత..
తల్లి... భార్య... నటి... ఎంటర్‌ప్రెన్యూర్... ఇలా రకరకాల పాత్రలను ఒకేసారి పోషించగలగటమనేది నా బలం. అయితే ఈ మధ్యకాలంలో మా అబ్బాయి విషయంలో కొంత ఆందోళన, భయం పట్టుకున్నాయి. వాడు లేకుండా షూటింగ్‌కు కానీ, ఏదైనా పని మీద కానీ వెళ్తే... వాడు ఎలా ఉన్నాడో అనే ఆలోచనలు భయపెడుతున్నాయి. అందువల్ల ఎప్పటికప్పుడు ఇంటికి ఫోన్ చేస్తూ ఉంటా. గతంలో నాకు ఇలాంటి ఆందోళనలు లేవు. రిలాక్స్‌డ్‌గా ఉండేదాన్ని. నా మీద నాకు నమ్మకం ఉండేది. బహుశా యంగ్ మదర్స్ అందరికీ ఈ ఆందోళన ఉంటుందనుకొంటా.
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్..
ఒకప్పుడు సినిమా షూటింగ్ ఒకటే పని. ఇప్పుడు మా అబ్బాయి... ఫ్యామిలీ... షూటింగ్‌లు.. ఈ మూడింటితో చాలా బిజీగా ఉంటున్నా. ప్రస్తుతం ‘ఇండియన్-2’, ‘సత్యభామ’ చిత్రాలు పూర్తి చేశా. ఇంకొన్ని షూటింగ్‌లు చివరి దశలో ఉన్నాయి. పెళ్లికి ముందు కేవలం షూటింగ్‌లపైనే దృష్టి ఉండేది. ఒక షూటింగ్ నుంచి మరొక షూటింగ్‌కు వెళ్తూ ఎప్పుడూ బిజీగా ఉండేదాన్ని. కుటుంబం కోసం సమయమే ఉండేది కాదు. కానీ ఇప్పుడలా కాదు. షూటింగ్‌లు, ఫ్యామిలీ.. మా బాబు... ఇవన్నీ కలిపి మై లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.
Read More: Tollywood, Cinema news