K Raghavendra Rao: ‘హనుమాన్’, ‘నా సామిరంగ’ సక్సెస్‌లపై దర్శకేంద్రుడి స్పందన ఇదే..
ABN, Publish Date - Jan 15 , 2024 | 08:30 PM
ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నాలుగు సినిమాలు పోటాపోటీగా విడుదలయ్యాయి. కలెక్షన్ల పరంగా అన్ని సినిమాలు మంచిగానే ప్రదర్శన చేస్తున్నాయి. తాజాగా సంక్రాంతికి విడుదలైన సినిమాలలోని రెండు సినిమాల గురించి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ట్విట్టర్ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ‘హనుమాన్’, ‘నా సామిరంగ’ సినిమా టీమ్‌లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నాలుగు సినిమాలు పోటాపోటీగా విడుదలయ్యాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘గుంటూరు కారం’ (గుంటూరు కారం).. తేజ సజ్జా, ప్రశాంత్ వర్మల కాంబోలో రూపుదిద్దుకున్న ‘హను-మాన్’ (Hanu-Man).. విక్టరీ వెంకటేష్, శైలేష్ కొలనుల ‘సైంధవ్’ (Saindhav).. కింగ్ నాగార్జున, విజయ్ బిన్నిల ‘నా సామిరంగ’ (Naa Saami Ranga) సినిమాలు ఈ సంక్రాంతి (Sankranthi)కి విడుదల కాగా.. అన్ని సినిమాలు హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతున్నాయి. సంక్రాంతి అనేది సినిమాల పండగ కూడా కావడంతో.. ప్రేక్షకులు వారికి అందుబాటులో ఉన్న సినిమాని చూసేస్తున్నారు. వెంకీ ‘సైంధవ్’ రేసులో కాస్త వెనుకపడినప్పటికీ కలెక్షన్స్ విషయంలో మాత్రం బాగానే స్కోర్ చేస్తోంది. ఇక ‘హను-మాన్’ బీభత్సానికి అయితే థియేటర్లే దొరకడం లేదు. హిందీ బెల్ట్‌లో కూడా ‘హను-మాన్’ భారీగా కలెక్షన్స్ రాబడుతోంది. తాజాగా ఈ సంక్రాంతికి వచ్చిన ‘హను-మాన్’, ‘నా సామిరంగ’ సినిమాలపై దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు (K Raghavendra Rao) ట్విట్టర్ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు.
ముందుగా ‘హను-మాన్’ గురించి చెబుతూ.. (K Raghavendra Rao About Hanu-Man Success)
‘‘సంక్రాంతి వేళ వచ్చిన హనుమాన్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో హీరో తేజ సజ్జా నటన, ప్రశాంత్ వర్మ దర్శకత్వం, విజువల్‌గా చిత్రాన్ని తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉన్నాయి. చిత్ర బృందానికి శుభాకాంక్షలు. అందరికి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు.
‘నా సామిరంగ’ విషయానికి వస్తే.. (K Raghavendra Rao Reaction on Naa Saami Ranga)
‘‘నా అభిమాన నటుడు, నా అన్నమయ్య, శ్రీరామదాసు అయిన నాగార్జున నటించిన నా సామిరంగా చిత్రం విజయాన్ని సాధించడం సంతోషకరమైన విషయం. నాగార్జున నటనతో పాటు కీరవాణి నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోశాయి. అల్లరి నరేష్ చక్కగా తన పాత్రను పోషించాడు. నా సామిరంగా చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు..’’ అని రాఘవేంద్రుడు ట్విట్టర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
====================
*Netflix: ‘దేవర’, ‘పుష్ప2’.. 2024లో నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే 12 సినిమాల లిస్ట్ విడుదల
****************************
*Mega156: మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట కాంబో చిత్ర టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అద్భుతం
************************
*Vijay Binni: ‘నా సామిరంగ’ రిజల్ట్‌పై దర్శకుడి రియాక్షన్ ఇదే..
***************************
*Teja Sajja: ‘హను-మాన్’ విడుదల తర్వాత మెగాస్టార్ ఏమని మెసేజ్ చేశారంటే..
***************************
*Extra Ordinary Man: ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ ఓటీటీలోకి వచ్చే డేట్ ఫిక్స్
**************************