Jr NTR: ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు

ABN, Publish Date - Sep 21 , 2024 | 02:39 PM

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ ‘దేవర’. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ నేపధ్యంలో ‘దేవర’ సినిమా టికెట్ల రేట్ల పెంపుకు, అలాగే అదనపు షోలకు అనుమతినిచ్చిన ఏపీ ప్రభుత్వానికి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ ఏమన్నారంటే..

Jr NTR In Devara

‘దేవర’ (Devara) సినిమా టికెట్ల రేట్ల పెంపుకు, అలాగే అదనపు షోలకు అనుమతినిచ్చిన ఏపీ ప్రభుత్వానికి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ ‘దేవర’. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటించారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె నిర్మించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ గ్రాండ్‌గా రిలీజ్ చేస్తోంది. ఈ క్రమంలో ‘దేవర’ సినిమా టికెట్ల ధరలను పెంచుకునేందుకు, అలాగే అదనపు షోల నిమిత్తం ఏపీ ప్రభుత్వాన్ని సితార సంస్థ సంప్రదించగా.. అందుకు ప్రభుత్వం అనుమతులు ఇస్తూ జీవోని విడుదల చేసింది.

Also Read- Devara: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఫ్యాన్స్‌కి పండగే!


ఈ జీవోలో.. ‘దేవర’ సినిమా టికెట్ల రేటు పెంపు మరియు ఎక్స్‌ట్రా షోలకు ఏపీ ప్రభుత్వం‌ నుంచి అనుమతులను మంజూరు చేయటం జరిగింది. అదనపు ప్రదర్శనల విషయానికి వస్తే.. తొలిరోజు (విడుదల రోజు) 6 షోలకు (అర్థరాత్రి 12 గంటల నుంచి ప్రారంభం), ఆ తర్వాత రోజు నుంచి 9 రోజుల పాటు 5 షోలకు అనుమతి ఇవ్వడం జరిగింది. టికెట్ల రేటు విషయానికి వస్తే.. మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ. 135, సింగిల్ స్ర్కీన్ అప్పర్ క్లాస్ రూ. 110, లోయర్ క్లాస్ రూ. 60 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వడం జరిగిందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.


సినిమా టికెట్ల ధర పెంపుకు, అదనపు షోలకు అనుమతిని ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి చిత్ర నిర్మాతలు, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మాత నాగవంశీ ట్విట్టర్ ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ట్విట్టర్ ఎక్స్ వేదికగా.. ‘దేవర సినిమా విడుదల నిమిత్తం నూతన జీవోని ఆమోదించినందుకు, తెలుగు సినిమా పరిశ్రమకు నిరంతరం మద్దతు ఇస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. గౌరవనీయులు సీఎం చంద్రబాబు నాయుడుగారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌గారికి నా ధన్యవాదాలు..’ అని పేర్కొన్నారు. తారక్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Also Read- Tirupati Controversy: ల‌డ్డూ వివాదంపై పవన్ కళ్యాణ్‌కు ప్రకాశ్ రాజ్ కౌంటర్

Also Read- ANR100: ఏఎన్నార్‌ను స్మరించుకున్న చిరు, బాలయ్య

Also Read- Jani Master: నేరాన్ని అంగీకరించిన జానీ మాస్టర్.. రిమాండ్ రిపోర్ట్ ఇదే

Read Latest Cinema News

Updated Date - Sep 21 , 2024 | 02:43 PM