Devara Vs Karthi: ఎన్టీఆర్ ‘దేవర’తో.. సై అంటున్న కార్తీ ‘సత్యం సుందరం’
ABN, Publish Date - Sep 11 , 2024 | 10:00 AM
కార్తీ , అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘సత్యం సుందరం’ విడుదలకు సిద్ధమైంది. అయితే జూ. ఎన్టీఆర్ దేవర సినిమా కూడా అదే రోజున విడుదల ఉండడంతో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కార్తీ (Karthi), అరవింద్ స్వామి (Arvind Swami), రాజ్‌కిరణ్ (Rajkiran), శీదివ్య (Sri Divya) వంటి ప్రధాన తారాగణం నటించిన చిత్రం ‘మెయ్యళగన్’ (Meiyazhagan). హీరో సూర్య (Suriya) జ్యోతిక (Jyotika) దంపతులు తమ సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్మెంట్ (2D Entertainment) పతాకంపై ఈ మూవీని నిర్మించగా విజయ్ సేతుపతి ‘96’ వంటి కల్ట్ క్లాసిక్ సినిమాను తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ (PremKumar) ఈ చిత్రానికి దర్శకుడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది.
ఇదిలాఉండగా ఈ సినిమాను తెలుగులో ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram)గా తీసుకువస్తున్నారు. దీంతో సర్వత్రా ఇప్పుడు ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తంజావూరు నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఇందులో కార్తీ (Karthi) పల్లెటూరి యువకుడిగా, అరవింద్ స్వామి (Arvind Swami) నగరవాసిగా చూపించారు. వారిద్దరి మధ్య జరిగే ఘర్షణ, సంఘర్షణలే ఈ సినిమా.
ఇటీవలే ఈ సినిమా ఆడియో రిలీజ్ చెన్నైలో నిర్వహించగా సూర్య, తండ్రి శివ కుమార్ హజరయ్యారు. అయితే ఈ సినిమాను తమిళ, తెలుగు భాషల్లో ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ క్రమంలో ఈ ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు.
ఇదిలాఉండగా ఈ సత్యం సుందరం (Sathyam Sundaram) చిత్రం రిలీజవుతున్న రోజే జూ. ఎన్టీఆర్ (NTR) దేవర (Devara) విడుదల కానుండడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ పోటీపైనే ఉంది. ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవర రిలీజ్ సమయంలో ఎలాంటి పోటీ లేదని అనుకుంటున్న సమయంలో ఇప్పుడు సడన్‌గా ఈ సత్యం సుందరం (Sathyam Sundaram) విడుదలకు సిద్దమవడంతో పోటీ రసవత్తరంగా మారింది.
ఇదిలాఉండగా సత్యం సుందరం (Sathyam Sundaram) ప్రచార కార్యక్రమాలను త్వరలో తెలుగులోనూ ప్రారంభించనున్నారు. కార్తీ (Karthi) చివరగా గత దీపావళికి జపాన్ (Japan) అనే సినిమాతో రాగా ఆ మూవీ భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం కార్తీ నటించిన సర్దార్ 2 (Sardar 2) సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. మంచి కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్న కార్తీ (Karthi)కి ఈ సత్యం సుందరం (Sathyam Sundaram) సినిమా విజయం తప్పనిసరి అయింది.