JR NTR: దేవర పార్ట్‌ 2.. తారక్‌ ఏం చెప్పారంటే

ABN, Publish Date - Oct 05 , 2024 | 04:04 PM

‘దేవర’ (Devara) విజయంతో మంచి జోష్‌లో ఉన్నారు తారక్‌ (Tarak), కొరటాల టీమ్‌ (Koratala Siva) . ఇప్పుడు వారి దృష్టి పార్ట్‌ -2 పై పడింది. ప్రేక్షకులు కూడా దీని గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

‘దేవర’ (Devara) విజయంతో మంచి జోష్‌లో ఉన్నారు తారక్‌ (Tarak), కొరటాల టీమ్‌ (Koratala Siva) . ఇప్పుడు వారి దృష్టి పార్ట్‌ -2 పై పడింది. ప్రేక్షకులు కూడా దీని గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓ ఇంగ్లిష్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌ ‘దేవర2’కు (Devara 2)సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చారు. ‘దేవర’ సీక్వెల్‌ ఎప్పుడొస్తుంది అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘మొదటి భాగం చిత్రీకరణ సమయంలోనే పార్ట్‌2లో కొన్ని సన్నివేశాలు షూట్‌ చేశాం. ఫస్ట్‌ పార్ట్‌ మంచి విజయం సాధించడంతో మాలో మరింత ఉత్సాహం పెరిగింది. బాధ్యత పెరిగింది. ‘దేవర’ కంటే రాబోయే సీక్వెల్‌ ఇంకా బాగుంటుంది. దీన్ని ప్రేక్షకులకు నచ్చేలా తీయడానికి మేం కొంత సమయం తీసుకోవాలనుకుంటున్నాం. ఇప్పటికే దీనికి సంబంధించిన కథ రెడీగా ఉంది. దానిని ఇంకా బెటర్‌గా షేపప్‌ చేయాలి. కొరటాల శివ దీనికోసం ఎంతో కష్టపడ్డారు. అందుకే ఓ నెలన్నర పాటు విశ్రాంతి తీసుకోమని చెప్పా. ఏమీ ఆలోచించకుండా ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్‌ చేసి రమ్మన్నాను. ఆ హాలీడేస్‌ నుంచి వచ్చాక  మిగతా పనులు మొదలుపెడతాం’’ అని అన్నారు. \

అలాగే టూర్స్‌ గురించి మాట్లాడారు తారక్‌. లాస్‌ ఏంజెలెస్‌ తనకు మరో హోంటౌన్‌ అని ఎన్టీఆర్‌ అన్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా తర్వాత ఆ ప్రాంతం తన మనసుకు మరింత దగ్గరైందన్నారు. ‘దేవర’ విడుదల సమయంలో నేను విదేశాల్లో ఉన్నా. లాస్‌ ఏంజెల్స్‌లో జరిగిన బియాండ్‌ ఫెస్టివల్‌లో దేవర ప్రదర్శన కోసం వెళ్లా. 24 ఏళ్ల సినీ కెరీర్‌లో నా సినిమా రిలీజ్‌ రోజు ఇంట్లో లేకుండా ఉండడం మొదటిసారి అని తెలినారు. ఈ చిత్రం దాదాపు రూ.405 కోట్లు వసూలు చేసిందని మేకర్స్‌ చెబుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ డ్యూయల్‌ రోల్‌ చేసిన ఈ చిత్రంతో జాన్వీ కపూర్‌ తెలుగుతెరకు పరిచయమయ్యారు. 

Updated Date - Oct 05 , 2024 | 04:05 PM