Rakesh varre: ధర్మం కోసం పోరాటం

ABN, Publish Date - Nov 01 , 2024 | 04:09 PM

రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy) . ఉయ్యాలా జంపాల, మజ్ను వంటి హిట్సి చిత్రాలను అందించిన విరించి వర్మ (Virinchi Varma) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది


రాకేష్ వర్రే (Rakesh Varre) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy) . ఉయ్యాలా జంపాల, మజ్ను వంటి హిట్సి చిత్రాలను అందించిన విరించి వర్మ (Virinchi Varma) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ట్రైలర్ విడుదల చేశారు, ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునే అంశాలతో ఉండగా, ప్రధాన పాత్రలు పోషించిన రాకేష్ పర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలిచిందని చిత్ర బృందం చెబుతోంది. యధార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.  కాలేజీ రోజుల నుంచే ప్రజా సమస్యల కోసం పోరాడుతూ దేశం కోసం ధర్మం కోసం నక్సలైట్ల తో జితేందర్ రెడ్డి చేసిన పోరాటాన్ని ఈ సినిమా లో చూపించారు. అంతే కాకుండా, ఆ తర్వాత అతను రాజకీయాల్లోకి రావడం, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న సీనియర్ తో మాట్లాడటం ట్రైలర్ లో చూపించారు. యాక్షన్ డ్రామా గా రాబోతున్న ఈ చిత్రం లో డైలాగ్స్ ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. చక్కని కెమరా వర్క్ కి నేపథ్య సంగీతం కూడా తోడవడం కలిసొచ్చే అంశం. టెక్నికల్ గా ఈ సినిమా అన్ని విభాగాల్లో హైలైట్ గా నిలిచింది. రాకేష్ ఇప్పటి వరకు పోషించిన అన్ని పాత్రల్లోకి ఇది చాలా డిఫరెంట్ అని తెలుస్తుంది. 1980 కాలంలో జగిత్యాల చుట్టు పక్కల జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని  ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

Updated Date - Nov 01 , 2024 | 04:51 PM