మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Committee Kurrollu: నిహారిక‌ ‘కమిటీ కుర్రోళ్ళు’.. జయప్రకాష్ నారాయణ వ‌దిలిన ‘గొర్రెలా..’ పాట

ABN, Publish Date - May 07 , 2024 | 06:53 PM

ఎన్నికల సమయం దగ్గర పడుతుంది.. రాజకీయ పార్టీలు ప్రజలను ప్రలోభ పెట్టటానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నింటినీ అన్వేషిస్తున్నాయి. ఓట్లను డబ్బులతో కొంటున్నారు.. మందు, చీరలిచ్చి ఓటర్లను తమ వైపు తిప్పుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. ఇది తప్పు.. ఓట్లను కొనేసి తర్వాతే ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ.. గొర్రెల్లా కాకుండా మనిషిలా ఆలోచించి ఓటు వేయాలంటూ చెబుతున్నారు ‘కమిటీ కుర్రోళ్ళు’. అది కూడా మాటగా కాదండోయ్.. చక్కటి పాట రూపంలో. ‘గొర్రెలా..’అంటూ సాగే ఈ పాటను అనుదీప్ దేవ్ సంగీత సారథ్యంలో నాగ్ అర్జున్ రెడ్డి రాశారు. అనుదీప్ దేవ్, వినాయక్, అఖిల్ చంద్ర, హర్షవర్ధన్ చావలి, ఆదిత్య భీమతాటి, సింధూజ శ్రీనివాసన్, మనీషా పండ్రాంకి, అర్జున్ విజయ్ పాడారు.

Committee Kurrollu

నిహారిక కొణిదెల (Niharika Konidela) సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ (Pink Elephant Pictures)ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’(Committee Kurrollu). య‌దు వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ కాబోతుండ‌గా తాజాగా మంగళవారం ఈ సినిమా నుంచి ‘గొర్రెలా.. #GorrelaSong’ అనే సాంగ్‌ను జయప్రకాష్ నారాయణ చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ (Jayaprakash Narayan) మాట్లాడుతూ.. ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu) చిత్రంలో ‘గొర్రెలా..’ అనే పాట పెట్టి ఊర్రుతలూగించారు. అలాగే యువతను ఆలోచింపజేశారు. దేశ భవిష్యత్తును కాపాడాలంటే యువతలో సరైన ఆలోచన ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని రేసీగా, ఉత్సాహంగా, ఆలోచనాత్మకంగా చక్కటి పాటను చిత్రీకరించారు. నిర్మాత నిహారిక, డైరెక్టర్ వంశీ, పాట రాసిన నాగార్జున, మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్‌లకు ఈ సందర్భంగా మనసారా అభినందిస్తున్నా. భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటు వేయాలని యువత సహా అందరినీ కోరుతున్నా అన్నారు.


నిర్మాత నిహారిక కొణిదెల (Niharika Konidela) మాట్లాడుతూ ‘మా సినిమాలో పాటను విడుదల చేసినందుకు ముందుగా జయప్రకాష్ నారాయణగారికి థాంక్స్ చెబుతున్నాను. నిజానికి జయప్రకాష్ గారు మాట్లాడిన ఓ స్పీచు వినే మా డైరెక్టర్ వంశీ సినిమాను స్టార్ట్ చేశారని ఈ సందర్భంగా ఆయనకు తెలియజేస్తున్నాను. జయప్రకాష్ గారికి మరోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం’ అన్నారు.

Updated Date - May 07 , 2024 | 06:54 PM