Devara BTS: 'ఎవరీ దేవత'.. అంటూ బీటీఎస్ వీడియోపై కామెంట్లు!
ABN, Publish Date - Aug 08 , 2024 | 11:39 AM
బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ (Janhvi kapoor) కొద్దిరోజులుగా ఇంటర్‌నెట్‌లో ట్రెండింగ్‌లో ఉంది. 'ఉలఝ్' (Ulahj) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఇచ్చిన ప్రతీ ఇంటర్వ్యూలోనూ ఆసక్తికర విషయాలు చెప్పి అందరి దృష్టిని తనవైపు తిప్పుకొంది.
బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ (Janhvi kapoor) కొద్దిరోజులుగా ఇంటర్‌నెట్‌లో ట్రెండింగ్‌లో ఉంది. 'ఉలఝ్' (Ulahj) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఇచ్చిన ప్రతీ ఇంటర్వ్యూలోనూ ఆసక్తికర విషయాలు చెప్పి అందరి దృష్టిని తనవైపు తిప్పుకొంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘దేవర’లోని సెకెండ్ సింగిల్ సాంగ్ 'చుట్టమల్లే సాంగ్ (Chuttamalle song) ట్రెండ్ సృష్టిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ రొమాంటిక్ సాంగ్‌లో తారక్(NTR), జాన్వీల డాన్స్‌తోపాటు విజువల్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది అంటూ కితాబిస్తున్నారు. తాజాగా ఈ పాటకు సంబంధించిన బీటీఎస్ (-BTS-బిహైండ్ ది సీన్స్) వీడియోను జాన్వీ కపూర్ ఇన్ స్టాలో షేర్ చేయగా అది విపరీతంగా వైరల్‌గా మారింది. నెటిజన్లతో పాటు పలువురరు ప్రముఖులు ఈ వీడియోకు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.
జాన్వీ స్నేహితుడు, మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహాడియా (Shikhar Pahariya) చేసిన కామెంట్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. వీడియోను లైక్ చేసిన శిఖర్.. ‘వావ్.. ఎవరీ దేవత’ (Wow who is this goddess)అని కామెంట్ పెట్టారు. నెటిజన్లు కూడా ఈ వీడియోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు ఈ సాంగ్ యూట్యూబ్‌లోనూ రికార్డు సృష్టిస్తోంది. విడుదలైన కొద్దీ సేపటికే ట్రెండింగ్‌లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు యూట్యూబ్ ట్రెండింగ్‌లో నం.1లో ఉంది. 46 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయని తెలుపుతూ చిత్రబృందం తాజాగా ఓ పోస్టర్ విడుదల చేసింది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈచిత్రం తెరకెక్కుతోంది. రెండు పార్టులుగా ఈ చిత్రానికి రూపొందిస్తున్నారు. మొదటిభాగాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నారు. ఇందులో సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఆయన తెలుగులో నటిస్తున్న తొలి చిత్రమిది. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. అనిరుధ్థ్ సంగీతం అందిస్తున్నారు.