Dil Raju: ఈ జనరేషన్‌లో డబ్బులు అవసరమే.. కానీ..
ABN, Publish Date - Aug 19 , 2024 | 07:15 PM
దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న తాజా చిత్రం ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka). శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ సినిమాను నిర్మించారు. వెర్సటైల్ యాక్టర్ సుహాస్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని సందీర్ రెడ్డి బండ్ల (Sandeep Reddy Bandla) డైరెక్ట్ చేశారు.
దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న తాజా చిత్రం ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka). శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ సినిమాను నిర్మించారు. వెర్సటైల్ యాక్టర్ సుహాస్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని సందీర్ రెడ్డి బండ్ల (Sandeep Reddy Bandla) డైరెక్ట్ చేశారు. సెప్టెంబర్ 7న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది. హీరో సుహాస్(Suhas)పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఈ సినిమా నుంచి ‘నా ఫేవరేట్ నా పెళ్లాం’ సాంగ్‌ను లాంచ్ చేశారు.
నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘జనక అయితే గనక కాన్సెప్ట్ గురించి సందీప్ చెప్పినప్పుడు సినిమా చేద్దామని అన్నాను. తర్వాత తను ప్రశాంత్ వర్మ, ప్రశాంత్ నీల్ దగ్గర రైటర్‌గా జాయిన్ అయ్యాడు. వర్క్ చేశాడు. ప్రశాంత్ కూడా కాన్సెప్ట్ విని బాగుందనటంతో స్క్రిప్ట్ రెడీ చేశాం. సుహాస్ కంటే ముందు చాలా మంది ఈ కథను విన్నారు. అందరూ ఎగ్జయిట్ అయ్యారు. కానీ అమ్మో! మేం చేస్తే ఎలా ఉంటుందో అని అన్నారు. బలగం రిలీజ్ తర్వాత నేనే ఓ రోజు సందీప్, హర్షిత్‌లను పిలిచాను. సుహాస్‌తో చేస్తే బావుంటుందని చెప్పాను. తనైతే కథతో రీచ్ అవుతాడనిపించిందన్నాను. వెంటనే వాళ్లు కూడా బావుంటుందన్నారు. మంచి కాన్సెప్ట్‌తో సినిమాలు వచ్చి ఆడుతున్నప్పుడు మాకొక కిక్ వస్తుంది. అలాంటి స్క్రిప్టే ఇది. మిడిల్ క్లాస్ అబ్బాయి.. తనకొచ్చే జీతంతో హ్యాపీగా ఉంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు వద్దనుకుంటాడు. ఎందుకు పిల్లలు వద్దనుకుంటున్నావని ఎవరైనా అడిగితే అందరికీ లెక్కలు చెప్పి నోరు మూయిస్తుంటాడు. ఈరోజుల్లో ఉన్న జనరేషన్‌లో డబ్బులు అవసరమే, ఎమోషన్స్ కూడా అవసరమే. డైరెక్టర్ సందీప్ తన రియల్ లైఫ్‌లో చూసిన ఇన్సిడెన్స్‌ను బేస్ చేసుకుని కథను తయారు చేశాడు. దీన్ని హ్యుమరస్‌గా, మంచి కాన్సెప్ట్‌తో సినిమా చేశారు. సినిమా చూశాను. చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమాను మీరు చూడబోతున్నారనే నమ్మకంతో ఉన్నాం. సెప్టెంబర్ 7న సినిమాను రిలీజ్ చేయబోతున్నాం. కమిటీ కుర్రోళ్ళు, ఆయ్ సినిమాలను ప్రేక్షకులు ఎలాగైతే ఫ్రెష్‌గా ఫీలయ్యారో జనక అయితే గనక సినిమాను అలాగే ఫీల్ అవుతారు. కావాల్సినంత హ్యుమర్ ఉంటుంది. నాన్ స్టాప్ ఎంటర్‌టైనర్ మూవీ ఇది. సుహాస్, సంగీర్తన జంట ఆన్ స్క్రీన్ చక్కగా ఉంటుంది. మిడిల్‌క్లాస్ అబ్బాయిగా సుహాస్ చక్కగా నటించాడు. లవ్ అంటే చాలా పాటలను మనం చూశాం. భార్య ప్రేమ గురించి గొప్పగా చెప్పటానికి సందీప్‌కు అవకాశం దక్కింది. దాన్నే ఈసినిమాలో పాటగా రూపొందించారు. ప్రతీ భర్త తన భార్యకు డేడికేట్ చేయాల్సిన పాటే ‘నా ఫేవరేట్ నా పెళ్లాం’ అని అన్నారు.
దర్శకుడు సందీప్ మాట్లాడుతూ ‘‘కొత్త టాలెంట్‌ను నమ్మి ఎంకరేజ్ చేసేవాళ్లలో రాజుగారిని మించినవాళ్లు లేరు. ఒక బొమ్మరిల్లు, ఒక ఆర్య, ఒక బలగం అయినా చేయగల ఏకైక ప్రొడ్యూసర్ రాజుగారే. అడుగులు వేసేవాళ్లు నడవగలరు అని నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత దిల్‌రాజుగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హర్షిత్‌గారు ముందు లైన్ విని నమ్మి రాజుగారి దగ్గరకు తీసుకెళ్లాం. నా ఫస్ట్ హీరో సుహాస్, హీరోయిన్ సంగీర్తన. సక్సెస్‌ఫుల్ టీమ్ నన్ను సక్సెస్ చేయటానికి ముందుకు వచ్చినందుకు థాంక్స్’’ అన్నారు.
నిర్మాత హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ‘‘మనం బయట వర్క్ చేస్తుంటే, ఇంట్లో అన్నీ పనులు చేస్తూ చాలా వరకు విషయాలను హ్యాండిల్ చేస్తూ బ్యాక్ బోన్‌లా ఉండే వ్యక్తి భార్య. అలాంటి వారిని అప్రిషియేట్ చేస్తూ వచ్చే సందర్భంలో ఇలాంటి పాట ఉండాలని మా డైరెక్టర్‌గారు ఈ పాటను రాయించారు. 20 ఏళ్లుగా నేను పాటలు వింటున్నాను. ఇలాంటి పాట, సిట్యువేషన్ నాకు తెలిసి రాలేదు. యూనిక్ సిట్యువేషన్. భార్యభర్తలు ఇద్దరూ కలిసి పాటను వినొచ్చు. మధ్యతరగతి మనషుల మనసులను అద్భుతంగా ఆవిష్కరిస్తూ రైటర్ కృష్ణకాంత్ మంచి పాటను రాశారు. బేబితో చాలా పెద్ద హిట్ కొట్టిన విజయ్, ఈ సినిమాకు చాలా మంచి సంగీతాన్ని అందించారు. యూనిక్ పాయింట్‌తో రాబోతున్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది’’ అన్నారు.
హీరో సుహాస్ మాట్లాడుతూ ‘‘ముందు ఈ స్టోరీని నాకు వినిపించిన హర్షిత్, హన్షితగారికి థాంక్స్. చాలా మంచి స్టోరీ. మా డైరెక్టర్ సందీప్‌గారు జీవితంలో మరచిపోలేని సినిమానిచ్చారు. మా హీరోయిన్ సంగీర్తన సినిమా తర్వాత అందరికీ నచ్చేస్తుంది. మంచి సంగీతాన్నిచ్చిన విజయ్ బుల్గానిన్, రాసిన కెకెగారు సహా అందరికీ థాంక్స్’’ అన్నారు.