Indian 2: సినిమా చివర్లో ఏం చెప్పబోతున్నారంటే !
ABN, Publish Date - May 16 , 2024 | 05:25 PM
కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా శంకర్ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'భారతీయుడు 2’ (Indian2). 28 ఏళ్ల క్రితం వీరిద్దరి కాంబోలో వచ్చిన 'భారతీయుడు’కు సీక్వెల్‌గా ఇది రానుంది. తాజాగా దీనికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా శంకర్ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'భారతీయుడు 2’ (Indian2). 28 ఏళ్ల క్రితం వీరిద్దరి కాంబోలో వచ్చిన 'భారతీయుడు’కు సీక్వెల్‌గా ఇది రానుంది. తాజాగా దీనికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ చిత్రానికి మూడో భాగం కూడా ఉండబోతోందని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు సంబరపడుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని చిత్రం బృందం తెలిపింది. పార్ట్ 2తోపాటే మూడో భాగాన్ని (Indian3) కూడా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు సినిమాలను ఏడాదిలోపే విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలిసింది. ‘భారతీయుడు 2’ ట్రైలర్ రిలీజ్ కోసం యూనిట్ ఓ భారీ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తోందట. ఇప్పటికే ఆ పనులు పూర్తయినట్లు టాక్. జూన్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు చిత్ర బృందం గతంలోనే తెలిపింది. జూన్‌కు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కష్టమని అందుకే దీన్ని జులై 12కు వాయిదా వేసినట్లు టాక్ వినిపిస్తుంది.
అన్నిటికంటే ముఖ్యంగా ఈ మూవీ టీమ్ భారీ సర్ప్రైజ్కు ప్లాన్ చేసిందట. పార్ట్2 క్లైమాక్స్ లో మూడో భాగం ట్రైలర్‌ను ప్రదర్శించాలని ప్రయత్నిస్తున్నారట.. అదే రోజున పార్ట్ 2 విడుదల తేదీని కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. 1996లో శంకర్ దర్శకత్వంలో వచ్చి భారతీయుడు సంచలనం సృష్టించింది. సేనాపతిగా కమల్ విజృంభించారు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’తో మరోసారి మ్యాజిక్ చేసేందుకు సిద్థమైంది. ఇది విడుదలైన వెంటనే మూడో భాగానికి సంబంధించిన నిర్మాణాంతర పనుల్ని మొదలు పెట్టనున్నారు. ఈ చిత్రంలో కాజల్, రకుల్ ప్రీత సింగ్ నాయికలు.