మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Natarathnalu: మే 17న థియేట‌ర్ల‌లోకి.. బిగ్‌బాస్‌ ఇనయ సుల్తానా ‘నటరత్నాలు’

ABN, Publish Date - May 16 , 2024 | 09:10 PM

ఇనయ సుల్తానా, సుదర్శన్ రెడ్డి, రంగస్థలం మహేష్ మరియు తాగుబోతు రమేశ్ పాత్రల్లో నటించిన చిత్రం నటరత్నాలు. మే 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ కు మంచి స్పందన లభించింది.

Natarathnalu

ఇనయ సుల్తానా (Inaya Sulthana), సుదర్శన్ రెడ్డి, రంగస్థలం మహేష్ మరియు తాగుబోతు రమేశ్ పాత్రల్లో నటించిన చిత్రం నటరత్నాలు (Natarathnalu). ఎన్నో హిట్లు ఇచ్చిన డైరెక్టర్లు కూడా ఈ సినిమాలో యాక్టర్లుగా యాక్ట్ చేయడం జరిగింది. చందనా ప్రొడక్షన్ సమర్పణలో ఎవరెస్ట్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన “నటరత్నాలు” క్రైం కామెడీ థ్రిల్లింగ్ నేపథ్యంలో దర్శకుడు శివనాగు తెరకెక్కించిన చిత్రం. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ కు చాలా మంచి స్పందన లభించింది. 'నటరత్నాలు' మే 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

దర్శకుడు శివనాగు మాట్లాడుతూ.. సినిమా అంటే నాకు ప్రాణం సినిమానే నా జీవితం. సినిమా కోసం పుట్టాను సినిమాతోనే ప్రాణం వదులుతాను. సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమా తీయాలి అనే వాళ్ళు ఎలా విఫలమవుతున్నారు? ఎలా సఫలమవుతున్నారు? ఏం చేస్తున్నారు అనే కథగా ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాను.

నాకు ఎంత సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ అలాగే టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా మే 17న మీ ముందుకు రాబోతుంది. ఈ సినిమాను మంచి సక్సెస్ చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు.


నిర్మాత చంటి యలమాటి గారు మాట్లాడుతూ.. మంచి హిట్లు ఇచ్చిన డైరెక్టర్లను యాక్టర్లుగా మార్చిన సినిమా నటరత్నాలు. సూర్యకిరణ్ లో ఒక నటుడిని చూస్తారు. డైరెక్టర్ శివ నాగు నాకు ఈ నటరత్నాలు కథ చెప్పడం జరిగింది. ఈ కథ సినిమాలో సినిమా లాంటిది. ఇండస్ట్రీకి వచ్చి ఏదో సాధించాలని హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ అవ్వాలని కలగని యువత చాలామంది ఉన్నారు.

డైరెక్టర్ శివ నాగు గారు డైనమిక్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్. ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ పైన మంచి స్పందన లభించింది. మే 17న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. కచ్చితంగా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది అన్నారు.

Updated Date - May 16 , 2024 | 09:10 PM