SIMBAA: తన ప్రయాణం గుర్తు చేసుకుంటూ దర్శకుడు ఎమోషనల్!

ABN, Publish Date - Aug 05 , 2024 | 04:41 PM

జగపతి బాబు, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సింబా’. ఆగస్ట్ 9న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఇటీవ‌ల‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ‌చ్చిన అతిథులు ప్రేక్ష‌కుల‌కు మంచి ఆఫ‌ర్ ఇచ్చారు.

simbaa

జగపతి బాబు (Jagapathi Babu), అనసూయ (Anasuya Bharadwaj) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సింబా’(SIMBAA). సంపత్ నంది టీం వర్క్స్ (Sampath Nandi Team Works), రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంపత్ నంది (Sampath Nandi), దాసరి రాజేందర రెడ్డి (Rajender Reddy) ఈ చిత్రాన్ని నిర్మించారు. సంపత్ నంది అందించిన ఈ కథకు మురళీ మనోహర్ (Murali Manohar) దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆగస్ట్ 9న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఇటీవ‌ల‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, ఎమ్మెల్యే విజయ రమణారావు, రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మురళీ మనోహర్ (Murali Manohar) మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన జర్నీలో సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ‘‘సింబా చాలా కొత్త కథ, కొత్త పాయింట్‌తో రాబోతోంది. సంపత్ నంది గారు అద్భుతంగా కథ రాశారు. ఇంత మంచి ప్రాజెక్ట్‌ను రాజేందర్ గారు నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఆయన విజన్‌కు హ్యాట్సాఫ్. ఎల్లప్పుడూ మా వెంట ఉండి సహకారం అందించారు. నాకు ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన నా ఫ్యామిలీకి (ఎమోషనల్ అవుతూ), టీంకు థాంక్స్. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’’ అని ద‌ర్శ‌కుడు మురళీ మనోహర్ చెప్పుకొచ్చారు.

సంపత్ నంది (Sampath Nandi) మాట్లాడుతూ.. ఈ సినిమా కథ అందరికీ కనువిప్పు కలిగేలా, ఎంటర్టైన్ చేసేలా, మంచి సందేశం ఇచ్చేలా ఉంటుంది. నేను మా నిర్మాత రాజేందర్ రెడ్డికి మంచి మాస్ కమర్షియల్ కథలు చెప్పా.. లాభాలు వస్తాయని చెప్పా. కానీ మా నిర్మాత మాత్రం సింబా కథను ఎంచుకున్నారు. సమాజానికి మంచి చేయాలనే, ఏదైనా తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ చిత్రం చేశారు. అలాంటి మంచి వ్యక్తి కోసం ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. సినిమా నిర్మాణంలో సాయం చేసిన పూర్ణ, రాఘవ గారికి థాంక్స్. సైంటిఫిక్‌గా హెల్ప్ చేసిన కిషోర్, స్క్రిప్ట్ ఐడియా ఇచ్చిన విజయ్‌ల‌కు థాంక్స్. ఈ సినిమాను చూస్తే వందకు వంద మార్కులు వేస్తారు’ అని అన్నారు.


నిర్మాత రాజేందర్ రెడ్డి (Rajender Reddy) మాట్లాడుతూ.. ‘వనజీవి రామయ్య గారు కోటికి పైగా మొక్కలు నాటారు. స్కూల్ పుస్తకాల్లో వీరి మీద పాఠాలున్నాయి. వీళ్లని చూసి ఇన్‌స్పైర్ అయి ఈ కథను రాసుకున్నాం. ప్రకృతి లేకపోతే మనం ఉండలేం. ప్రకృతికి కోపం వస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఆగస్ట్ 22న చిరంజీవి గారికి పుట్టిన రోజున కొన్ని వేల మొక్కల్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. మా ఊర్లోనూ మొక్క‌లు నాటుతున్నాం. ఈ సినిమాకు వ‌చ్చే లాభాలను కూడా మొక్కల రూపంలోనే ఖర్చు పెట్టాలని అనుకుంటున్నాం. ఇప్పటి వరకు ఇలాంటి కాన్సెప్ట్‌తో ఇండియన్ స్క్రీన్ మీద సినిమా రాలేదు. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

నటుడు శ్రీనాథ్ మాట్లాడుతూ.. ప్రజ‌లు ఎవ‌రైనా త‌మ త‌మ ప్రాంతాల్లో మొక్కలు నాటి మాకు మెసేజ్ పెడితే టికెట్లు ఫ్రీగా ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. అదే స‌మ‌యంలో అతిథిగా వ‌చ్చిన మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సంతోష్ కుమార్ కూడా స్పందిస్తూ ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలు వారికి నేను కూడా టికెట్లు అంద‌జేస్తానని ప్ర‌క‌టించారు.

Updated Date - Aug 06 , 2024 | 12:25 AM