మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Allu Arjun: మైనపు ప్రతిమ.. ఐకాన్ స్టార్ స్పందన ఇదే!

ABN, Publish Date - Mar 28 , 2024 | 04:43 PM

ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకుని ఆ ఘ‌న‌త సాధించిన తొలి తెలుగు హీరోగా రికార్డుల‌కెక్కిన అల్లు అర్జున్ కీర్తికిరీటాల‌లో మ‌రో ఘ‌న‌త వ‌చ్చి చేరింది.

allu arjun

పుష్ప సినిమాతో జాతీయ‌ స్థాయిలో గుర్తింపు పొందిన అల్లు అర్జున్ ఆ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకుని ఆ ఘ‌న‌త సాధించిన తొలి తెలుగు హీరోగా రికార్డుల‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆ ఖ్యాతిని మ‌రింత ఇనుమ‌డింప చేస్తూ ఆయ‌న కీర్తికిరీటాల‌లో మ‌రో ఘ‌న‌త వ‌చ్చి చేరింది. అదేంటంటే ప్ర‌ఖ్యాత టుస్పాడ్స్ మ్యూజియం (madame tussauds) లో ఆయ‌న మైన‌పు ప్ర‌తిమ (Wax statue) ను గురువారం రాత్రి 8గంట‌ల‌కు అవిష్క‌రించ‌నున్నారు.

ఈ నేపథ్యంలో.. దుబాయ్‌లో మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో నిర్వ‌హించిన తన మైనపు (Wax statue) విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్ప‌టికే అల్లు అర్జున్ త‌న ఫ్యామిలీతో క‌లిసి దుబాయ్ చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న సోష‌ల్ మీడియాలో త‌న ప్ర‌తిమ‌తో దిగిన ఫొటోను సోష‌ల్ మీడియాలో పోస్టు చేసి.. ఇలాంటి ప్ర‌ముఖ (madame tussauds) మ్యూజియంలో విగ్ర‌హం ఏర్పాటు చేయ‌డం ప్ర‌తి న‌టుడి జీవితంలో మైల్‌స్టోన్ అంటూ వ్యాఖ్యానించారు. వారికి కృత‌జ్ఞ‌త‌లు అని తెలిపారు. ఇప్పుడు ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. మీరూ చూసేయండి.


ఇదిలాఉండ‌గా ఇప్ప‌టివ‌ర‌కు మేడమ్‌ టుస్సాడ్స్ (madame tussauds) మ్యూజియంలో మ‌న తెలుగు నుంచి ప్రభాస్‌, మహేష్‌ బాబు వంటి వారివి మాత్ర‌మే మైనపు విగ్రహాలు (Wax statue) ఉండ‌గా తాజాగా ఆ లిస్టులో అల్లు అర్జున్ కూడా చేరిపోయారు. అయితే ప్రభాస్‌, మహేష్‌ బాబుల విగ్రహాలు లండన్ మ్యూజియంలో ఉండ‌గా.. అల్లు అర్జున్‌ విగ్రహం మాత్రం దుబాయ్‌ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ మ్యూజియంలో ఇప్పటి వరకు సౌత్‌ ఇండియాకు చెందిన నటుల విగ్రహాలకు చోటుదక్కలేదు. మొట్టమొదటిసారి అల్ల్లు అర్జున్‌ విగ్రహం అక్కడ ఏర్పాటు చేస్తుండటం విశేషం. దీంతో దక్షిణాది తొలి హీరోగా బన్నీ రికార్డ్‌ సెట్‌ చేశారు.

సింగపూర్‌, లండన్‌, దుబాయ్‌.. ఇలా పలు చోట్ల  ఈ మ్యూజియానికి సంబంధించిన శాఖలు ఉన్నాయి. దుబాయ్‌ (madame tussauds) మ్యూజియంలో ఇప్పటికే బాలీవుడ్‌ స్టార్స్‌ అమితాబ్‌ బచ్చన్‌, షారుక్‌ ఖాన్‌, ఐశ్వర్య రాయ్‌, రణ్‌బీర్‌ కపూర్‌  విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో టాలీవుడ్‌ నుంచి అల్లు అర్జున్ (Allu Arjun) చేరారు. అంతే కాకుండా దుబాయ్‌ గోల్డెన్‌ వీసా అందుకున్న తొలి తెలుగుస్టార్‌ కూడా ఆయనే కావడం విశేషం.

Updated Date - Mar 28 , 2024 | 04:43 PM