Kanguva: సూర్య ‘కంగువా’ తెలుగు ట్రైలర్ ఎలా ఉందంటే?

ABN, Publish Date - Aug 13 , 2024 | 05:08 PM

త‌మిళ‌ స్టార్ హీరో సూర్య నటించిన‌ ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. సోమవారం త‌మిళ ట్రైలర్ రిలీజ్ చేయ‌గా అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో తాజాగా మంగ‌ళ‌వారం రోజున తెలుగు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

kanguva

త‌మిళ‌ స్టార్ హీరో సూర్య (Suriya) నటించిన‌ ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’ (Kanguva). ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది. చిరుత్తై శివ (Siva) దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుద‌ల చేసిన‌ విజువల్స్‌, మూవీ గ్లింప్స్‌, సాంగ్స్‌, టీజర్‌లకు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వచ్చిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో సోమవారం త‌మిళ ట్రైలర్ రిలీజ్ చేయ‌గా అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో తాజాగా మంగ‌ళ‌వారం రోజున తెలుగు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

ఈ ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే.. బ‌ల‌మైన క‌థ‌తోనే ఈ సినిమా తెర‌కెక్కిన‌న్న‌ట్లుగా తెలుస్తుండ‌గా, న‌టీన‌టుల యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉంది. విజువల్స్ అయితే మైండ్‌బ్లోయింగ్ ఉన్నాయి. ట్రైలర్ ప్రారంభ‌మే ఓ మహిళ వాయిస్‌తో మొదలవ‌గా.. సూర్య ఓ డిఫరెంట్‌ లుక్‌లో కనిపించాడు. బాబీ డియోల్ (Bobby Deol), సూర్యల‌ డైలాగులు, దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం హైలెట్‌గా ఉన్నాయి. సూర్య స‌ర‌స‌ర‌ దిశా పటానీ (Disha Patani) క‌థానాయిక‌గా, ప్రతి నాయకుడిగా బాబీ డియోల్ (Bobby Deol) తమ యాక్టింగ్‌తో అందరగొట్టేశారు.


సూర్య దాదాపు మూడేండ్ల త‌ర్వాత వ‌స్తున్న చిత్రమ‌వ‌డం, తాజాగా రిలీజ్ చేసిన ట్రైల‌ర్ హాలీవుడ్ స్థాయిలో ఉండ‌డంతో ఈ సినిమాపై ఒక్కసారిగా భారీ అంచనాలు పెరిగిపోయాయి. యూవీ క్రియేషన్స్‌తో కలిసి కేఈ ఙ్ఞానవేల్‌ రాజా స్టూడియో గ్రీన్‌ పతాకంపై భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్‌ సహా ఏకంగా పదికి పైగా భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబరు 10వ తేదీన‌ విడుదల చేస్తున్నారు. కాగా ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది.

Updated Date - Aug 13 , 2024 | 07:03 PM