Hari Hara Veera Mallu Relese Date: అభిమానులకు శుభవార్త.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

ABN, Publish Date - Sep 23 , 2024 | 12:15 PM

పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు మరో గుడ్‌ న్యూస్‌ అందింది. త్వరలోనే సెట్స్‌ మీద ఉన్న సినిమాల షూటింగ్‌లో పాల్గొంటానని ప్రకటించిన ఆయన తన తాజా చిత్రం 'హరిహర వీరమల్లు’ విడుదల తేదీని ప్రకటించి అభిమానుల్లో ఉత్సాహం పెంచారు

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) అభిమానులకు మరో గుడ్‌ న్యూస్‌ అందింది. త్వరలోనే సెట్స్‌ మీద ఉన్న సినిమాల షూటింగ్‌లో పాల్గొంటానని ప్రకటించిన ఆయన తన తాజా చిత్రం 'హరిహర వీరమల్లు’ (HariHara Veeramallu) విడుదల తేదీని ప్రకటించి అభిమానుల్లో ఉత్సాహం పెంచారు. పీరియాడికల్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం రిలీజ్‌ డేట్‌ను చిత్రబృందం సోమవారం ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ‘అన్‌స్టాపబుల్‌ ఫోర్స్‌, అన్‌బ్రేకబుల్‌ స్పిరిట్‌ మార్చి 28న విడుదల కానుంది’ అని ట్వీట్‌లో పేర్కొంది.  తొలుత ఈ చిత్రానికి క్రిష్‌ (Krish) దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వంలో 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఇప్పుడు ఎ.ఎం.రత్నం కుమారుడు జ్యోతికృష్ణ (Jyothi Krishna) దర్శకత్వంలో మిగతా షూటింగ్‌ చేయనున్నారు.  అంతే కాదు దీనికి సంబంధించిన షూటింగ్‌ కూడా మొదలుపెట్టారు. పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమా చిత్రీకరణ వాయిదా పడుతూ వస్తోంది. తన సన్నివేశాలు పూర్తి చేసేందుకు తాజాగా ఆయన అంగీకరించారు.  సోమవారం ఉదయం 7 గంటలకు విజయవాడలో సిద్థం చేసిన భారీ సెట్‌లో చిత్రీకరణ మొదలైంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ తెలియజేసింది. హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ నిక్‌ పాల్‌ ఆధ్వర్యంలో భారీ యాక్షన్‌ సన్నివేశాలను ఇక్కడ షూట్‌ చేయనున్నారని, పవన్‌తోపాటు కీలక పాత్రధారులు షూటింగ్‌లో భాగం కానున్నారని తెలిసింది.

రెండు పార్టులుగా ఈ చిత్రం మొదటి పార్ట్‌ ‘హరిహర వీరమల్లు: స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ పేరుతో విడుదల కానుంది. అనుపమ్‌ఖేర్‌, బాబీ దేవోల్‌, నిధీ అగర్వాల్‌, నోరాహి ఫతేహి, విక్రమ్‌ జీత్‌, జిషుేసన్‌ గుప్త కీలక పాత్రలు పోషిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందుతోంది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 

Updated Date - Sep 23 , 2024 | 01:04 PM