Hanuman: సక్సెస్‌ఫుల్‌గా వంద రోజులు.. ఇప్పటికీ థియేటర్లలో సందడి..
ABN, Publish Date - Apr 22 , 2024 | 03:44 PM
సంక్రాంతి బరిలో విడుదలై పండుగ టైంలో భారీ విజయాన్ని అందుకున్న ‘హనుమాన్’ సోమవారంతో 100 రోజులు పూర్తి చేసుకుంది. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికీ పలు థియేటర్స్‌లో ఆడుతోంది.
సంక్రాంతి బరిలో విడుదలై పండుగ టైంలో భారీ విజయాన్ని అందుకున్న ‘హనుమాన్’ (Hanuman)సోమవారంతో 100 రోజులు పూర్తి చేసుకుంది(100 Days) . తేజ సజ్జా హీరోగా (teja sajja)ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికీ పలు థియేటర్స్‌లో ఆడుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth varma) సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఈ అద్భుతమైన జర్నీలో భాగమైన అందరికీ కృతజ్ఞతలు. ఆనందంతో మనసు నిండిపోయింది. ఇప్పటికీ పలు థియేటర్‌లలో హనుమాన ఆడుతోంది. ుహనుమాన్’ శత దినోత్సవం చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ క్షణాలను జీవితాంతం గుర్తు పెట్టుకుంటా. ఈ రోజుల్లో థియేటర్లలో ఒక సినిమా 100 రోజులు ఆడటమనేది కనుమరుగై చాలా కాలమైంది. ఎక్కడో ఒక్కో సినిమా ఇలా అరుదుగా ఆడుతుంటాయి, మారిన సమయంలో.. మాకు ఇలాంటి ఆనందాన్ని అందించిన ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటా. నాకెంతో సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్’’ అని పోస్ట్ చేశారు. (Tollywood)
SABARI: 'నా చెయ్యి పట్టుకోవే...' వరలక్ష్మీ 'శబరి' నుంచి పాట విడుదల
హీరోగా (cinema News) నటించిన తేజ సజ్జా కూడా దీనిపై ఆనందం వ్యక్తం చేశారు. ‘‘ఆనందంతో హృదయం నిండిపోయింది. మీ వల్లే దీనిని సాధించాననే విషయాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా. ‘హనుమాన్’.. నాకు జీవితాంతం గుర్తుండే ఓ మధుర జ్ఞాపకం’’ అని పేర్కొన్నారు. అమృతా అయ్యర్ కథానాయిక. వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్, వెన్నెల కిషోర్ కీలక పాత్రధారులు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం సుమారు రూ.300 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ను కూడా దర్శకుడు ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది.