Chiranjeevi: చిరు స్టెప్పులకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఫిదా
ABN, Publish Date - Sep 22 , 2024 | 04:57 PM
156 సినిమాల్లో 537 పాటల్లో, 24000 మూమెంట్స్ వేసిన అరుదైన నటుడిగా చిరంజీవి గిన్నిస్ రికార్డ్ సొంతం చేసుకున్నారు.
మాస్, డాన్స్, గ్రేస్ కలగలిపితే చిరంజీవి (Chiranjeevi). ఎటువంటి సినీ నేపథ్యంలో లేకుండా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్వయంకృషితో మెగాస్టార్‌గా Megastar)ఎదిగారు. ఎంతోమంది సామాన్యులకు స్ఫూర్తినిచ్చారు. సుమారు 46ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో స్టార్‌గా వెలుగొందుతున్నారు. ఇప్పటి వరకు ఆయన 155 సినిమాలు చేశారు. ఫైట్లు, యాక్షన్, డ్యాన్సు, స్టైల్‌లో ఈ వయస్సులో కూడా ప్రేక్షకులను అలరిస్తున్నారు. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. చిరంజీవి తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఎన్నో ఘనతలు, అవార్డులు దక్కించుకున్నారు. నటనతోపాటు ఆయన బాడీలో డ్యాన్స్, ఆ డ్యాన్సుల్లో గ్రేస్, రిథమ్ కూడా కారణం అని చెప్పవచ్చు. ఇప్పుడు ఆ డ్యాన్సులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కేలా చేశాయి. (Guinness World Records)
చిరంజీవి 150కు పైగా సినిమాలు చేశారు. అందులో కొన్ని వందల పాటలకు తనదైన శైలిలో డాన్స్‌లు వేశారు. ఆయనతోపాటు ఎంతోమంది హీరోలు వందల చిత్రాలు చేశారు. చిరంజీవి తరహాలో స్టెప్పులు వేసిన ఇండియన్ హీరో మరొకరు లేరని చెబితే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఆయన నృత్యాలకు గిన్నిస్ బుక్ ఫిదా అయ్యింది. 156 సినిమాల్లో 537 పాటల్లో, 24000 మూమెంట్స్ వేసిన అరుదైన నటుడిగా చిరంజీవి గిన్నిస్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. డ్యాన్సులకు గానూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ (Guinness record)రికార్డులో మెగాస్టార్ చిరంజీవి స్థానం సంపాదించుకున్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరగబోయే కార్యక్రమంలో బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ సమక్షంలో చిరంజీవికి గిన్నిస్ రికార్డును, గిన్నిస్ ప్రతినిధులు ప్రకటించనున్నారు. ఇది మెగా అభిమానులు, తెలుగు ప్రేక్షకులతోపాటు టాలీవుడ్ సినిమా ఇండస్ర్టీకి గర్వించే విషయంగా చెప్పొచ్చు.