Oh Manchi Ghost: ఎంత నవ్వుతారో.. అంతగా భయ పడతారు

ABN, Publish Date - Jun 19 , 2024 | 08:31 PM

వెన్నెల కిషోర్, నందితా శ్వేత, నవమి గాయక్, షకలక శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్, కామెడీ ఎంటర్‌టైనర్ OMG (ఓ మంచి ఘోస్ట్). ఈ చిత్రం జూన్ 21న రాబోతోంది. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Oh Manchi Ghost

వెన్నెల కిషోర్ (vennela kishore), నందితా శ్వేత (Nandita sweta), నవమి గాయక్ (Navami ), షకలక శంకర్, రజత్ రాఘవ్, నవిన్ నేని, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటించిన హారర్, కామెడీ ఎంటర్‌టైనర్ OMG (ఓ మంచి ఘోస్ట్) (Oh Manchi Ghost). మార్క్ సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్ మీద డా.అబినికా ఇనాబతుని నిర్మించిన ఈ చిత్రానికి శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్ 21న రాబోతోంది. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ ఈవెంట్‌లో.. దర్శకుడు శంకర్ మార్తాండ్ (Shankar Marthand) మాట్లాడుతూ.. ‘ఈ మూవీ స్క్రిప్ట్స్, డైలాగ్స్‌‌లో సహాయం చేసిన నా డైరెక్షన్ టీంకి, మత్తు వదలరా డైరెక్టర్ రితేష్ రానా గారికి థాంక్స్. మా నిర్మాత ఫాదర్ రాధాకృష్ణ గారికి థాంక్స్. అనూప్ రూబెన్స్ గారి వల్లే ఈ సినిమా ప్రారంభం అయింది. మా మీదున్న నమ్మకంతో అబినికా ఈ సినిమాను నిర్మించారు. అనూప్ ఆర్ఆర్ తరువాత సినిమా నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లింది. ఆండ్రూ కెమెరా వర్క్ బాగుంటుంది. ఫైట్ మాస్టర్ తక్కువ టైంలోనే కావల్సిన అవుట్ పుట్ ఇచ్చారు. మా సినిమాను రిలీజ్ చేస్తున్న ఏసియన్ ఫిల్మ్స్, బాలాజీ ఫిల్మ్స్‌కి థాంక్స్. మా చిత్రం జూన్ 21న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.


నిర్మాత డా.అబినికా ఇనాబతుని మాట్లాడుతూ.. ‘నిర్మాతగా ఇది మాకు మొదటి చిత్రం. శంకర్ ఎంత బాగా కథ చెప్పారో.. అంతకు మించి అనేలా సినిమాను తీశారు. అందరూ చూడదగ్గ చిత్రమిది. జూన్ 21న మా చిత్రం రాబోతోంది. సినిమా చూసి ఎలా ఉందో చెప్పండి’ అని అన్నారు. అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. కరోనా టైంలో శంకర్ నాకు ఈ కథను చెప్పారు. అప్పుడు చిన్నగా అనుకున్నారు. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులతో సినిమా అద్భుతంగా వచ్చింది. వెన్నెల కిషోర్, నందిత, షకలక శంకర్ మధ్య సీన్లు బాగా వచ్చాయి. హారర్, కామెడీ మిక్స్ చేసి బాగా తీశారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.

నందితా శ్వేత మాట్లాడుతూ.. ‘నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. శంకర్ నాకు ఈ కథను చెప్పినప్పటి నుంచి షూటింగ్ కోసం ఎంతో ఎగ్జైటెడ్ గా ఉన్నాను. స్టోరీ నెరేట్ చేస్తూ ఉంటే నవ్వుతూనే ఉన్నాను. హారర్, కామెడీ జానర్లతో రాబోతున్న ఈ మూవీని కుటుంబ సమేతంగా చూడొచ్చు. అందర్నీ నవ్వించేలా మా సినిమా ఉంటుంది. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఓ మంచి ఘోస్ట్ సినిమా షూటింగ్‌ను మేం అంతా సరదాగా చేశాం. అందరికీ నచ్చేలానే ఈ సినిమా ఉంటుంది’ అని అన్నారు. నవమి గాయక్ మాట్లాడుతూ.. ‘నాకు మంచి పాత్రను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఆండ్రూ మా అందరినీ బాగా చూపించారు. అనూప్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నందిత గారు నాకెంతో సపోర్ట్ ఇచ్చారని అన్నారు.

నటుడు నవీన్ నేని మాట్లాడుతూ.. ‘నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన మా దర్శక, నిర్మాతలకు థాంక్స్. సెట్స్‌లో అల్లరి చేస్తూ షూటింగ్ చేశాం. ఎంతో సరదాగా సినిమా షూటింగ్‌ను చేశాం. మూవీ ఎంతో బాగా వచ్చింది. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది’ అని అన్నారు. రజత్ రాఘవ్ మాట్లాడుతూ.. ‘ఇంత మంచి టీంతో పని చేయడం ఆనందంగా ఉంది. సుబ్బు గారి ఫైట్స్, అనూప్ గారి ఆర్ఆర్ అదిరిపోతుంది. వెన్నెల కిషోర్, నందిత, షకలక శంకర్, నవీన్ ఇలా అందరితో నటించడం ఆనందంగా ఉంద‌న్నారు. ఎంత నవ్వుతారో అంతగా భయపడతారు. జూన్ 21న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

Updated Date - Jun 19 , 2024 | 09:41 PM