Ooru Peru Bhairavakona: అది సాధ్యమైన పని కాదు.. న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్
ABN, Publish Date - Feb 15 , 2024 | 04:18 PM
సందీప్ కిషన్ (Sundeep kishan) హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ థ్రిల్లర్ ‘ఊరు పేరు భైౖరవకోన’ (. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సందీప్ కిషన్ (Sundeep kishan) హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ థ్రిల్లర్ ‘ఊరు పేరు భైౖరవకోన’ (. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాపై ఉన్న నమ్మకంతో ఇప్పటికే కొన్ని చోట్ల పెయిడ్ ప్రీమియర్స్ వేయగా, చక్కని టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో సినిమా విడుదల వాయిదా పడుతుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. న్యాయపరమైన వివాదం నెలకొనడం ఇందుకు కారణం. అయితే, దీనిపై చిత్ర బృందం స్పష్టత ఇచ్చింది. సినిమా విడుదలకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయని, అనుకున్న తేదీనే మూవీని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలని కోరుతూ విశాఖకు చెందిన ఫిలిం డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్) హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. ‘ఏజెంట్’ మూవీ డిస్ట్రిబ్యూషన్ విషయంలో తొలుత చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం నిర్మాతలు తనకు ప్రసార హక్కులు ఇవ్వలేదని ఆరోపించారు. ఇందుకు వివరణ ఇవ్వాలని కోరినా స్పందించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు. కేసు విచారించిన న్యాయస్థ్థానం ‘ఊరు పేరు భైరవకోన’కు ‘ఏజెంట్’ చిత్రానికీ సంబంధం లేదని, తాజా మూవీ విడుదలను ఆపటం సాధ్యమైన పని కాదని చెప్పింది. అయితే, కేసు విచారణ కొనసాగిస్తామన్న కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా వేసింది.