Majic: కాలేజి.. అందులో ఫెస్ట్... ఓ పాట!
ABN, Publish Date - Jan 29 , 2024 | 12:23 PM
‘జెర్సీ’ వంటి క్లాసికల్ సినిమా తర్వాత, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి పలు కొత్తవారిని ప్రధాన పాత్రధారులుగా పరిచయం చేస్తూ ‘మ్యాజిక్’ అనే సెన్సిబుల్ టీనేజ్ డ్రామాతో ముందుకు రావాలని నిర్ణయించుకున్నారు.
ప్రతిభను ప్రోత్సహించడంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎప్పుడూ ముందు ఉంటుంది. గతేడాది ఎందరో కొత్త వారిని పరిచయం చేస్తూ ‘మ్యాడ్’ (Mad) చిత్రాన్ని రూపొందించి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి అలాంటి మ్యాజిక్‌ని చేయడానికి సిద్థమవుతోంది. ‘జెర్సీ’ వంటి క్లాసికల్ సినిమా తర్వాత, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి పలు కొత్తవారిని ప్రధాన పాత్రధారులుగా పరిచయం చేస్తూ ‘మ్యాజిక్’ (Majic) అనే సెన్సిబుల్ టీనేజ్ డ్రామాతో ముందుకు రావాలని నిర్ణయించుకున్నారు. ఈ కథ, తమ కాలేజీలో జరగబోయే ఫెస్ట్ కోసం ఒక ఒరిజినల్ సాంగ్ కంపోజ్ చేయడానికి నలుగురు టీనేజర్లు చేసే ప్రయత్నం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే ఎన్నో అంశాలుంటాయి. ఈ చిత్రం కోసం జాతీయ అవార్డులు గెలుచుకున్న సాంకేతిక నిపుణులు సైతం పనిచేస్తున్నారు. వీటన్నింటికీ మించి, ఈ మ్యూజికల్ జానర్ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషనల్ అనిరుధ్ సంగీతం అందించడం విశేషం. ఎన్నో అందమైన లొకేషన్లలో ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారు. గడ్డకట్టే పొగమంచు మరియు అకాల వర్షాలు వంటి అనేక ఇబ్బందులను అధిగమించి నీలగిరి కొండలు అందించే అద్భుతమైన ప్రకృతి అందాలను మరింత అందంగా తెరమీదకు తీసుకొచ్చారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సాయి సౌజన్యతో కలిసి సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ ఆకర్షణీయమైన టీనేజ్ మ్యూజికల్ లవ్‌స్టోరీ షూటింగ్ పూర్తయింది. ఈ సమ్మర్‌లో తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు.