Goreti Venkanna: దశాబ్దం గడిచిన అదే ఊపు.. ఆ పాటకు అరుదైన గౌరవం

ABN, Publish Date - Nov 18 , 2024 | 05:49 PM

తెలంగాణ ఉద్యమకారుడు, సినీ గేయ రచయిత గోరెటి వెంకన్న రచించిన ఓ పాటకి అంతర్జాతీయ వేదిక మీద అరుదైన గౌరవం దక్కింది. ఏంటంటే..

పదేళ్ల క్రితం తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా 'బందూక్'. ఈ సినిమాలో '30 వెడ్స్ 21' ఫేమ్ చైతన్య రావు ప్రధాన పాత్రలో నటించగా లక్ష్మణ్ మురారి ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికి తెలంగాణ ప్రజల గుండెల్లో మోగుతూనే ఉంటాయి. తాజాగా ఈ సినిమాకి అంతర్జాతీయ వేదికగా అరుదైన గౌరవం దక్కింది. ఏంటంటే..


మలేసియాలోని మలేషియా తెలంగాణ అసోసియేషన్(MYTA) దశాబ్ది వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పదేళ్ల క్రితం ఉదయం కాలంలో తెరకెక్కిన 'బందూక్' సినిమా టీమ్ ని ఘనంగా సత్కారించారు. ఈ సినిమాలో గేయ రచయిత గోరేటి వెంకన్న, మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్, గాయకుడు సాకేత్ కోమండురి కలిసి చేసిన "పూసిన పున్నమి వెన్నెలమేన (తెలంగాణ బ్రీత్ లెస్ సాంగ్)" ప్రభావానికి గాను అత్యున్నత గౌరవంతో సత్కారించారు.


ఈ కార్యక్రమంలో మలేసియా ప్రధానమంత్రి కార్యాలయ సభ్యులు, తెలంగాణ రాజకీయ ప్రముఖులు, చీఫ్ జస్టిస్'లు, రచయితలు, మేధావులు, సినీ నటినటులు, సామాజికవేత్తలు పాల్గొన్న ఈ భారీ ఉత్సవంలో మలేసియా ప్రెసిడెంట్ ఆఫీసు నుండి విచ్చేసిన సెక్రటరీ "దాటో రోమ్లి ఇషాక్" చేతుల మీదుగా "బందూక్" దర్శకులు లక్ష్మణ్ మురారిని "మైటా దశాబ్ది అవార్డు"తో సత్కరించారు!!

Updated Date - Nov 18 , 2024 | 05:49 PM