Gopichand: విశ్వం టీజర్ ఎలా ఉందంటే.. 

ABN, Publish Date - Sep 03 , 2024 | 09:37 PM

గోపీచంద్,  శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్నా చిత్రం 'విశ్వం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ సంస్థలు నిర్మిస్తున్నాయి.

గోపీచంద్9Gopichand),  శ్రీను వైట్ల (Srinu vaitla)కాంబినేషన్ లో వస్తున్నా చిత్రం 'విశ్వం' (Vishwam). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. కావ్య థాపర్ కథానాయిక.  మంగళవారం టీజర్ విడుదల చేసారు. స్టైలిష్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా రూపొందుతున్న ఈ చిత్రం  అక్టోబర్ 11న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.  టీజర్ నరేష్ వాయిస్‌ ఓవర్‌తో ప్రారంభమైంది. గోపీచంద్, కావ్యా థాపర్ పాత్రల పరిచయం, వారి క్యారెక్టర్స్ లో కామెడీ స్పార్క్‌ ఆకట్టుకున్నాయి. టీజర్ లో ప్రముఖ నటీనటులతో కామెడీ సీన్స్ హిలేరియస్ గా వున్నాయి, టీజర్ చివరి భాగంలో యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ అదిరిపోయాయి. ఎంటర్‌టైన్‌మెంట్,యాక్షన్‌ని ఎఫెక్టివ్‌గా బ్యాలెన్స్ చేస్తూ హైలీ ఎంటర్‌టైనింగ్ టీజర్ ని ప్రజెంట్ చేశారు శ్రీను వైట్ల. డైలాగ్‌లు, కామెడీ, యాక్షన్‌ బ్లెండ్ మంచి కమర్షియల్ ఔటింగ్ ని ప్రామిస్ చేస్తున్నాయి. 

గోపీచంద్ అల్ట్రా-స్టైలిష్‌గా కనిపించారు. తన ఇంటెన్సిటీతో కామెడీని బ్లెండ్ చేసే పాత్రలో మెరిశారు. కావ్య థాపర్ తన గ్లామర్‌తో ఆకట్టుకోగా, నరేష్, వెన్నెల కిషోర్, మిగతా నటులు వినోదాన్ని అందించారు. కెవి గుహన్ సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా నిలిచింది, చైతన్ భరద్వాజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథకు మరింత డెప్త్ ని జోడించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌ పై నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ నిర్మాణ విలువలు టాప్ క్లాస్ లో వున్నాయి. శ్రీనువైట్ల బ్లాక్‌బస్టర్స్‌కు పని చేసిన గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే రాశారు.  అక్టోబర్ 11న దసరాకి విడుదల కానుంది. 

గోపీచంద్ మాట్లాడుతూ " శ్రీనువైట్ల గారితో సినిమా చేయాలని చాలా సంవత్సరాలుగా అనుకుంటున్నాను. ఏడాది క్రితం  ఆయన్ని ఓ పార్టీలో కలవడం, సినిమా చేద్దామని అనుకోవడం, అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయ్యింది. నేను చాలా మంది డైరెక్టర్స్ తో వర్క్ చేశాను. శ్రీను వైట్ల గారు కంఫర్ట్ బుల్, హీరో డైరెక్టర్. హీరోని ఎలా చూపించాలనే కంప్లీట్ క్లారిటీ వున్న డైరెక్టర్. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని వుంది. ఒక మంచి ఎంటర్ టైనర్ చేయాలని అనుకున్నాను.  ఇంత పెద్ద స్కేల్ లో ఆయన మార్క్ మిస్ అవ్వకుండా ఎవ్రీ ఫ్రేంలో నవ్వు వస్తునే వుంటుంది. అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. కావ్య చాలా బాగా చేసింది. చేతన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. గోపి మోహన్ నా లక్ష్యం, లౌక్యం తర్వాత మళ్ళీ ఈ సినిమాకి పని చేశారు. టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేశాం. ఈ సినిమా డెఫినెట్ గా మంచి హిట్ అవుతుందనే నమ్మకం వుంది' అన్నారు 

శ్రీనువైట్ల మాట్లాడుతూ.. ప్రేక్షకులు నా నుంచి ఏం కోరుకుంటారో మారుతున్న టైమ్ ని ద్రుష్టిలో పెట్టుకొని ఒక ఫ్రెష్ థీమ్, చాలా లేయర్స్ తో ప్రాపర్ బ్లెండ్ తో చేసిన కమర్షియల్ సినిమా ఇది. వేణు దోనేపూడి గారితో సినిమా స్టార్ట్ అయ్యింది. తర్వాత విశ్వగారు స్ట్రాంగ్ సపోర్ట్ గా వచ్చారు. వారికి థాంక్ యూ. అవుట్ పుట్ చూసి అందరూ హ్యాపీగా వున్నారు. నాకు సపోర్ట్ గోపి గారికి థాంక్ యూ. కావ్య థాపర్ ఎనర్జిటిక్ గా చేసింది. చాలా పెద్ద స్కేల్ వున్న ఫిలిం ఇది. నా గత సినిమాలకి మించి ఇందులో హిలేరియస్ కామెడీ వుంటుంది. దసరాకి ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేశాలా వుంటుంది. చేతన్ ఈ సినిమాకి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇటలీ రొమ్ మిలాన్ సర్జినియా గోవా హిమాచల్ ప్రదేశ్ .. ఇలా చాలా ప్లేసస్ లో షూట్ చేశాం" అని అన్నారు.

Updated Date - Sep 03 , 2024 | 09:37 PM