Viswam: షూటింగ్ చేసేప్పుడు.. నవ్వు ఆపుకోలేకపోయా
ABN, Publish Date - Oct 09 , 2024 | 10:16 PM
మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'విశ్వం'. కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో గోపీచంద్ విలేకరుల సమావేశంలో విశ్వం మూవీ విశేషాలని పంచుకున్నారు.
మాచో స్టార్ గోపీచంద్ (Gopichand), దర్శకుడు శ్రీను వైట్ల (Srinu vaitla) ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'విశ్వం'. కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో గోపీచంద్ విలేకరుల సమావేశంలో విశ్వం మూవీ విశేషాలని పంచుకున్నారు.
శ్రీనువైట్ల గారు ఈ కథ నేరేట్ చేసినప్పుడు మీ ఇనిషియల్ ఫీలింగ్ ఏమిటి?
శ్రీనువైట్ల గారితో సినిమా చేయాలని చాలా బ్యాక్ అనుకున్నాం. గతంలో ఓ రెండు లైన్స్ చెప్పారు. అవి బావున్నాయి కానీ నాకు సరిపోవనిపిస్తుందని చెప్పాను. తర్వాత 'విశ్వం' కథ లైన్ గా చెప్పారు. పాయింట్, గ్రాఫ్ గా చాలా బావుంది. ఇందులో అన్నీ చక్కగా కుదురుతాయనిపించింది. తర్వాత అన్నీ తన స్టయిల్ కి తగ్గట్టుగా చేసుకోవడానికి ఆయన ఏడు నెలలు సమయం తీసుకొని విశ్వం కథని ఫాం చేరు. ఇందులో కంప్లీట్ గా శ్రీనువైట్ల గారి మార్క్ తో పాటు యాక్షన్ ఫన్, కామెడీ అన్నీ పెర్ఫెక్ట్ గా వున్నాయి.
విశ్వం షూటింగ్ లో మిమ్మల్ని ఎక్సయిట్ చేసిన ఎలిమెంట్స్ ఏమిటి ?
శ్రీనువైట్ల గారితో వర్క్ చేయడం ఎక్సైటింగ్ అనిపించింది. 24 అవర్స్ ఆయన సినిమా తప్పితే వేరేది ఆలోచించరు. ఆయనకి సహజంగా కోపం రాదు. ఒక ఆర్టిస్ట్ కి కంఫర్ట్ జోన్ ఇచ్చి కావాల్సిన పర్ఫార్మెన్స్ ని రాబట్టుకోవడంలో ఆయన మాస్టర్. లౌక్యం తర్వాత అంత మంచి ఎంటర్టైన్మెంట్ విశ్వంలో కుదిరింది. షూటింగ్ చేసేటప్పుడు నేనే కొన్ని సీన్స్ కి నవ్వు ఆపుకోలేక పోయేవాడిని. చాలామంది ఆర్టిస్టులకి సారీ కూడా చెప్పాను. సీన్స్ అంత హిలేరియస్ గా వచ్చాయి.
ఇందులో ట్రైన్ ఎపిసోడ్ హైలెట్ గా వుంటుందని విన్నాం?
శ్రీను వైట్ల గారి వెంకీ సినిమాలో పాపులర్ ట్రైన్ ఎపిసోడ్ ఉంది కాబట్టి డెఫినెట్ గా ఆయన నుంచి మరో ట్రైన్ ఎపిసోడ్ వస్తుందంటే కంపారిజన్ ఉంటుంది. అయితే అది వేరే జోనర్, ఇది వేరే జోనర్. అయితే ఈ కంపేరిజన్ కి విశ్వం ట్రైన్ సీక్వెన్స్ రీచ్ అవుతుంది. ఎంటర్టైన్మెంట్ చాలా అద్భుతంగా వచ్చింది. వెన్నెల కిషోర్, వీటి గణేష్, నరేష్ గారు, ప్రగతి గారు.. ఇలా అందరూ చాలా అద్భుతంగా చేశారు. ట్రైన్ సీక్వెన్స్ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు చిన్న టెన్షన్ కూడా రన్ అవుతుంది. అది చాలా బాగుంటుంది.
విశ్వం యాక్షన్ ఎలా వుంటుంది?
యాక్షన్ డిజైన్ రవివర్మ చేశారు. ఒక స్లీక్ యాక్షన్ గా చేద్దామని అనుకున్నారు. ఇందులో యాక్షన్ చాలా ఇంపాక్ట్ ఫుల్ గా ఉంటుంది.
ఇందులో పాప చుట్టూ కథ ఉంటుందా?
బేసిక్ గా ఇది హీరో స్టోరీ. పాపది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్. పాపకి ఏడేళ్లు ఉంటాయి. కానీ పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా చేసింది. ఆ పెర్ఫామెన్స్ చూసి షాక్ అయ్యాను. ఆ పాప కూడా ఈ సినిమాకి చాలా ప్లస్. ఇందులో ఫాదర్ ఎమోషన్, మదర్ ఎమోషన్ అన్ని బాగా వర్కౌట్ అయ్యాయి. శ్రీనువైట్ల గారు ఎమోషన్ ని చాలా అద్భుతంగా తీశారు.
యాక్షన్ కామెడీ రెండు డిఫరెంట్ జోనర్స్ కదా.. ఆ రెండిని ఎలా బ్లెండ్ చేశారు?
శ్రీను వైట్ల గారి సినిమాల్లో కామెడీ తో పాటు యాక్షన్ కూడా చాలా అద్భుతంగా బ్లెండ్ అయి ఉంటుంది. ఆయన ఈ రెండిటిని పర్ఫెక్ట్ బ్లడ్ తో తీసుకొస్తారు. మనం చెప్పాలనుకున్న కథని ఎంటర్టైన్మెంట్ గా చెప్తే ఆడియన్స్ చక్కగా రిసీవ్ చేసుకుంటారని ఆయన నమ్మకం. అలానే ఆయన సక్సెస్ అయ్యారు. విశ్వం కూడా అంత బాగుంటుందని మా నమ్మకం.
శ్రీను వైట్ల గారిలో నేచురల్ గానే ఒక సెటైరికల్ కామెడీ ఉంటుంది. ఆయన సినిమాలో ప్రతి క్యారెక్టర్ రిజిస్టర్ అవుతుంటుంది. ఆయనతో ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు తెలిసింది, ఆయన ప్రతి క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. షూటింగ్ చేసేటప్పుడు ఆయన టైమింగ్ పట్టుకోవడానికి ఫస్ట్ టుడేస్ నాకు కొంచెం కష్టం అనిపించింది. ఆయనది చాలా యూనిక్ టైమింగ్. మూడో రోజు నుంచి కొంచెం ఎక్కువ సార్లు చేసి చూపించరా అని అడిగాను. ఆయన చేసినట్లు కాపీ కొట్టేసాను. డబ్బింగ్ కూడా ఆయనకి ఎలా కావాలో ఆయన్ని చూసి కాపీకొట్టి చెప్పేసాను(నవ్వుతూ)
విశ్వం టైటిల్ గురించి?
ఇందులో నా క్యారెక్టర్ పేరు విశ్వం. అయితే రెండు అక్షరాలు ఉన్న టైటిల్ నా సెంటిమెంట్ అనుకుంటారేమో అని శ్రీను వైట్లగారికి చెప్పాను. అయితే ఈ సినిమాకి 'విశ్వం' టైటిల్ యాప్ట్ అని ఆయన చెప్పారు.
ఇందులో హైలెట్ అవుతాయనుకునే క్యారెక్టర్స్ ఏమిటి ?
పృథ్వి గారి క్యారెక్టర్, వెన్నెల కిషోర్ క్యారెక్టర్, నరేష్ గారి క్యారెక్టర్, ప్రగతి గారి క్యారెక్టర్, హీరోయిన్ ఫ్యామిలీ ట్రాక్.. ఇవన్నీ చాలా బాగుంటాయి.
ఇది శ్రీను వైట్ల గారి కం బ్యాక్ ఫిల్మ్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు కదా ?
సినిమా చూసే చెప్పాను. సినిమా చాలా బాగా వచ్చింది. అందుకే అంత కాన్ఫిడెంట్ గా చెప్పాను. డెఫినెట్ శ్రీనువైట్ల గారి పర్ఫెక్ట్ మార్క్ ఇందులో కనిపిస్తుంది. ఆయన మార్క్ పంచస్ వుంటాయి.
హీరోయిన్ కావ్య థాపర్ గురించి?
ఇందులో చాలా మంచి క్యారెక్టర్ చేసింది. హీరోతో ట్రావెల్ అయ్యే క్యారెక్టర్. చాలా బాగా చేసింది.
ఈ సినిమాలో మెమరబుల్ మూమెంట్స్, మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి?
కొంత ఎపిసోడ్ మనాలి లో మైనస్ 15 వద్ద షూట్ చేశాం. ఆ కండీషన్ లో షూటింగ్ చేయడం చాలా టఫ్. చేతులు వంకర్లు పోయావే. అలాగే ఒక మెలోడియస్ సాంగ్ ఉంది. అది ఇటలీలోని షర్టీనియాలో చేశాం. ఆన్ స్క్రీన్ చూసినప్పుడు ఆ లొకేషన్ చాలా అందంగా ఉంటుంది . కానీ అక్కడికి వెళ్లి షూట్ చేయడం అనేది చాలా చాలెంజింగ్. ఒక హిల్ ఏరియా లాంటిది. కొంచెం కాలు జారిన ఎక్కడో లోయలో ఉంటాం. ఇటలీలో మతేరా అనే చోట షూట్ చేశాం. అలాగే షర్టీనియాలో షూట్ చేశాం. ఇప్పటివరకు ఎవరు అక్కడ షూట్ చేయలేదు. చాలా మంచి మంచి లొకేషన్స్ ఇందులో ఉంటాయి.
ఇందులో సోషల్ మెసేజ్ ఉందా?
ఇండియాలో జరుగుతున్న ఒక ఇష్యూ ని అండర్ కరెంట్ గా చెబుతూ లాస్ట్ లో ఏమిటనేది చెప్తాం. అది ఎంటర్ టైన్మెంట్ వేలో వుంటుంది.
నిర్మాతల గురించి ?
ప్రొడ్యూసర్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాని నిర్మించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రావడం సినిమాకి మరింత ప్లస్ అయింది. అవుట్ పుట్ చాలా బావొచ్చింది.
మ్యూజిక్ గురించి
చేతన్ భారద్వాజ్ సౌండింగ్ చాలా బావుంది. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బీజీఎం కూడా అదరగొట్టాడు.
ఒక్క సెకన్ కూడా బోర్ కొట్టదని చెప్పారు?
సినిమా చాలా బావుంది. చూసినంతసేపు నవ్వుతూనే వుంటారు. థియేటర్ లో రెండున్న గంటల పాటు ఆడియన్స్ హిలేరియస్ గా ఎంటర్ టైన్ చేసే సినిమా ఇది. విశ్వం పర్ఫెక్ట్ పండగ సినిమా. వెరీ క్లీన్ గా వుంటుంది. ఫ్యామిలీ అంతా కలసి హాయిగా నవ్వుకోవచ్చు.
కథ విన్నప్పుడు ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారు?
స్టోరీ విన్నప్పుడు బోర్ కొట్టకూడదు. ఎంగేజింగ్ గా ఉండాలి. కథని నేను ఒక ఆడియన్ లాగే వింటాను. బోర్ కొట్టకుండా ఎంగేజింగ్ అనిపించినప్పుడు అలాంటి స్క్రిప్ట్ చేయడానికి ఇష్టపడతాను.
ప్రభాస్, మీ కాంబినేషన్ లో సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు?
మాకు చేయాలనే వుంది. కానీ అన్నీ సెట్ కావాలి. కుదిరినప్పుడు తప్పకుండా చేస్తాం.
యువీలో నెక్స్ట్ మూవీ చేస్తున్నారా?
స్టొరీ జరుగుతుంది. త్వరలో చెప్తాను.