మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Getup Srinu: జనసేనకు ప్రచారం చేయమని ఎవరూ అడగలేదు.. అభిమానంతో వెళ్లాం

ABN, Publish Date - May 05 , 2024 | 05:13 PM

నటి, ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా (Roja) తనపై చేసిన కామెంట్లపై గెటప్‌ శ్రీను (getup Srinu)  స్పందించారు. తాను ప్రధాన పాత్ర పోషించిన ‘రాజు యాదవ్‌’ (Raju yadav) సినిమా ట్రెలర్‌ విడుదల కార్యక్రమంలో పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

నటి, ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా (Roja) తనపై చేసిన కామెంట్లపై గెటప్‌ శ్రీను (getup Srinu)  స్పందించారు. తాను ప్రధాన పాత్ర పోషించిన ‘రాజు యాదవ్‌’ (Raju yadav) సినిమా ట్రెలర్‌ విడుదల కార్యక్రమంలో పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఇటీవల శ్రీను, సుడిగాలి సుధీర్‌, రాం ప్రసాద్‌ కలిసి పవనకు మద్దతుగా పిఠాపురంలో (Janasena) ప్రచారానికి వెళ్లారు. దీనిపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు రోజా స్పందించారు. ‘‘వాళ్లెంత? వాళ్ల ప్రాణమెంత? వీరితో ఎవరు మాట్లాడిస్తున్నారో వారి గురించి ఆలోచించాలి గానీ వీరిని అనడం వృధా. వీళ్లంతా చిన్న షోలు, చిన్న చిన్న పాత్రలు పోషించేవారు.  మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారనే భయంతో వారు ఆ కుటుంబంతో ఉన్నారు. ప్రేమతో కాదు. నిజంగా ప్రేమ ఉంటే.. వాళ్లు ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌కి సపోర్ట్‌ చేసినప్పుడు ఆయనెందుకు గెలవలేదు? ప్రేమ వేరు, భయం వేరు’’ అని పేర్కొన్నారు.

దీనిపై గెటప్‌ శ్రీను స్పందించారు. ‘‘మెగా ఫ్యామిలీతో ఎన్ని సినిమాలు చేశానో మీకు తెలుసు. వెంకటేశ్‌, ఎన్టీఆర్‌, నానిలతోనూ నేను  నటించా. ఇతర హీరోల చిత్రాల్లో నాకు ఆఫర్లు రావట్లేదా?. కొన్ని సందర్భాల్లో ఇలాంటివి తప్పవు. విమర్శించే వాళ్లు అలాగే ఉంటారు. ఒక మనిషి అందరికీ నచ్చాలని లేదు.  పవన్‌ కల్యాణ్‌పై (Pawan kalyan) అభిమానం ఉంది కాబట్టే జనసేన తరఫున ప్రచారం చేశా. ఆయనకు లక్ష మెజారిటీ వస్తుంది. పిఠాపురం నియోజకవర్గ ప్రజల స్పందన బాగుంది. అయితే మమ్మల్ని ప్రచారం చేయమని ఎవరూ అడగలేదు. నేను. సుధీర్‌, రాంప్రసాద్‌ మా అంతట మేమే ఫోన్‌ చేసి మరీ ప్రచారానికి వెళ్లాం తప్ప వాళ్లు రమ్మని అడగలేదు’’ అని వివరణ ఇచ్చారు. 

Updated Date - May 05 , 2024 | 05:33 PM