Game Changer: దీపావళికి 'గేమ్ ఛేంజ్' అయ్యేనా

ABN, Publish Date - Oct 24 , 2024 | 12:45 PM

భారీ బడ్జెట్, బిగ్ స్టార్ కాస్ట్, లెజండరీ డైరెక్టర్ ఇన్ని ఉన్న 'గేమ్ ఛేంజర్'‌కి కావాల్సినంత బజ్ క్రియేట్ కాలేదు. అయితే సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న వేళా మరింత బజ్ క్రియేట్ చేయడానికి మేకర్స్ దీపావళికి బిగ్ అప్డేట్ ఇవ్వనున్నారు.

గ్లోబల్‌స్టార్‌ రామ్‌ చరణ్‌(Ram charan), సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ (Shankar) కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘గేమ్‌ చేంజర్‌’ (Game Changer). కాంబినేషన్‌ రీత్యా ఈ చిత్రంపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. దిల్‌ రాజు (Dil raju), శిరీష్‌ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. అయితే సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న వేళా మరింత బజ్ క్రియేట్ చేయడానికి మేకర్స్ దీపావళికి బిగ్ అప్డేట్ ఇవ్వనున్నారు. ఇంతకీ ఏంటంటే..


భారీ బడ్జెట్, బిగ్ స్టార్ కాస్ట్, లెజండరీ డైరెక్టర్ ఇన్ని ఉన్న 'గేమ్ ఛేంజర్'‌కి కావాల్సినంత బజ్ క్రియేట్ కాలేదు. ఒకవైపు శంకర్ ఇండియన్ 2, మరోవైపు 'జరగండి' సాంగ్ మరింత నెగిటివిటీ స్ప్రెడ్ చేశాయి. ఇక సంక్రాంతి బరిలో ఉన్న ఈ సినిమా బాలకృష్ణ, వెంకటేష్, అజిత్, సందీప్ కిషన్ మూవీస్‌తో పోటీ పడాల్సి ఉంది. దీంతో అలర్ట్ అయినా మూవీ మేకర్స్ దీపావళి కానుకగా సినిమా టీజర్ విడుదల చేసి అభిమానుల్లో హైప్ పెంచాలని చూస్తున్నారు. మరోవైపు పుష్ప 2 సినిమా ఎలాంటి అప్డేట్స్ లేకుండానే పాన్ ఇండియా వైడ్‌గా విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే.


అయితే ఈ సారి సంక్రాంతి సోమవారం రానుంది. దీంతో సంక్రాంతి, భోగి, కనుమ హాలిడేస్ ముందే శని, ఆదివారాలు సెలవులు అదనంగా లభించనున్నాయి. పిల్లలకు ఎలాగో సంక్రాంతి హాలిడేస్ కలిసొస్తాయి. ఇంకా ఒకటి లేదా రెండు రోజులు లీవ్ పెట్టె జనాలు కూడా ఎక్కువే.. దీంతో ఈ సంక్రాంతి ఫిల్మ్ మేకర్స్‌తో పాటు ప్రేక్షకులకి ఎంతో కలిసొచ్చింది. గత సంక్రాంతిలతో పోల్చుకుంటే ఈ సారి పోటీ కాస్త తక్కువగానే కనిపిస్తుంది. అయితే మెగా స్టార్ 'విశ్వంభర'ని కాదని రంగంలోకి దిగుతున్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ పైన నిర్మాతలతో పాటు అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరో వైపు వెంకీ- అనిల్ రావిపూడి, బాలయ్య 109వ చిత్రాలు కూడా సంక్రాంతి బరిలో ఉండగా ఆ సినిమాలకి ఇంకా టైటిల్స్ ఖరారు చేయకపోవడం కొసమెరుపు.

Updated Date - Oct 24 , 2024 | 12:45 PM