Game Changer: గేమ్ ఛేంజర్ ప్రచారానికి పునాది.. దిల్ రాజు పెద్ద ప్లానే ఇది..
ABN, Publish Date - Nov 05 , 2024 | 11:08 AM
‘ఆర్.ఆర్.ఆర్’ తరవాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న చిత్రమిది. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. అయితే ఈ సినిమా అప్‌డేట్స్, ప్రమోషన్స్ విషయంలో అభిమానులు చాలా నిరాశగా ఉన్నారు.
‘ఆర్.ఆర్.ఆర్’ తరవాత రామ్ చరణ్ (Ram charan) నుంచి వస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). అగ్ర దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న చిత్రమిది. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. అయితే ఈ సినిమా అప్‌డేట్స్, ప్రమోషన్స్ విషయంలో అభిమానులు చాలా నిరాశగా ఉన్నారు. ఇప్పటి వరకూ కేవలం రెండు పాటలే బయటకు వచ్చాయి. రిలీజ్ డేట్ కూడా వాయిదా పడుతూ ఫైనల్‌గా జనవరి 10న డేట్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు ప్రమోషన్స్ కూడా స్పీడప్ చేసింది చిత్రబృందం. అందులో భాగంగా ఈనెల 9న టీజర్‌ని విడుదల చేస్తున్నారు. లక్నోలో ఈ కార్యక్రమం జరగబోతోంది. ముందుగా హైదరాబాద్‌లోనే ఈవెంట్ ప్లాన్ చేశారు. కానీ ఇక్కడ పరిస్థితులు, అనుమతులు అనుకూలించకపోవడంతో వేదిక లక్నోకి మారింది. (Game changer Teaser event lucknow)
పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న చిత్రం కాబట్టి దేశ వ్యాప్తంగా ప్రచారం అవసరం. ఈవెంట్ ఎక్కడ నిర్వహించినా సినిమాకు రావలసిన పబ్లిసిటీ, క్రేజ్ వస్తుంది. అందుకే లక్నోను వేదికగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి కనీసం రెండు వారాలకు ఓ ఈవెంట్ చేయాలని చిత్ర బృందం నిర్ణయించుకుందట. లేదా కనీసం ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ జనాల్లో క్రేజ్ పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారట దిల్ రాజు. ఈ చిత్రంలో చరణ్ విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. అయితే ఆ లుక్స్ అన్ని టీజర్‌లో చూపిస్తారా లేదా అన్నది సస్పెన్స్‌గా ఉంది. అయితే సినిమా కాన్సెప్ట్ ఏంటనేది తెలిసేలా ఓ థీమ్‌తో టీజర్ కట్ చేశారని తెలుస్తోంది.
'భారతీయుడు 2' పరాజయంతో శంకర్‌పై ఒత్తిడి పెరిగింది. ‘గేమ్ ఛేంజర్’తో మళ్లీ ఫామ్‌లోకి రావడం ఖాయం అని అభిమానులు చెబుతున్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్' తర్వాత వస్తున్న చిత్రం కాబట్టి చరణ్‌కు కూడా ఈ సినిమా ముఖ్యమే. మరి 'గేమ్ ఛేంజర్' రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే జనవరి 10 వరకూ వేచి చూడాల్సిందే. రామ్ చరణ్ సరసన కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తోంది. అంజలి, సునీల్, ఎస్ జె సూర్య, ప్రకాష్ రాజ్, సముద్రఖని, జయరాం, నవీన్ చంద్ర, మురళి శర్మ కీలక పాత్రధారులు.