Game Changer: 'నానా హైరానా' చేస్తున్న తమన్.. గేమ్ ఛేంజర్
ABN, Publish Date - Nov 27 , 2024 | 01:52 PM
గేమ్ ఛేంజర్ రిలీజ్ ముందు మ్యూజిక్ డైరెక్ట్ తమన్ నానా హైరానా చేస్తున్నారు. ఇంతకీ ఏమైందంటే..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 10 జనవరి, 2025న మూవీ గ్రాండ్ రిలీజ్ కానుంది. నవంబర్ 9న లక్నోలో ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్ అనంతరం సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం మేకర్స్ ప్రమోషన్స్‌ని యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ మూవీ థర్డ్ సింగిల్ కి సంబంధించిన బిట్వీన్ ది సెట్స్ వీడియోని తమన్ షేర్ చేశారు.
ఈ వీడియోలో శ్రేయ గోషాల్, కార్తీక్ పాడిన మూడు లైన్లను వినిపించారు. అలాగే వాళ్ళ చిట్ చాట్ విషయాలను పొందుపరిచారు. ఈ కొద్దిపాటి ప్రోమోలోనే సాంగ్ వీపరీతంగా ఆకట్టుకుంది. రామజోగయ్య శాస్త్రి మరోసారి వైవిద్యభరితమైన లిరిక్స్ తో ఆకట్టుకున్నారు. ఇక శంకర్ సినిమాల్లో మెలోడీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జెంటిల్ మెన్ నుండి ఇండియన్ 2 వరకు ఆయన సినిమాల్లోని మెలోడీ పాటలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ నానా హైరానా చిన్నగానే కనిపిస్తున్న నెట్టింట్లో మాత్రం వైరల్ గా మారింది. ఇక ఈ సాంగ్ సినిమా హైలెట్ లలో ఒకటి అవుతుందంటున్నారు. ఈ సాంగ్ ని ఇన్ఫ్రా రెడ్ కెమెరాతో షూట్ చేయడంతో ఒరిజినల్ లొకేషన్ ని ఇంకా మెరుగుపరిచి చూపిస్తుంది. ఈ పాటని విదేశాల్లో సెట్స్ మధ్య భారీ వ్యయం నిర్మించారు.
ఇప్పటికే ఇండియన్ సినీ హిస్టరీలో ఇప్పటి వరకు మరే సినిమా చేయని అద్భుతాన్ని ఈ సినిమా ఆవిష్కరించబోతోన్న విషయం తెలిసిందే. డిసెంబర్ 21న అమెరికాలో ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత భారీగా జరగనుంది. కర్టిస్ కల్‌వెల్ సెంటర్, 4999 నామన్ ఫారెస్ట్, గార్‌లాండ్ టి.ఎక్స్ 75040 ఈ ముందస్తు వేడుకకి వేదిక కానుండటం విశేషం. చిత్ర యూనిట్‌తో పాటు ప్రముఖులందరూ ఈ వేడుకకి హాజరుకాబోతున్నారు. సినిమాపై అంచనాలు నెక్ట్స్ లెవల్‌కు చేరుకున్న క్రమంలో ఛరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి ఆధ్వర్యంలో ఇంత భారీగా జరగనున్న వేడుక అందరిలోనూ ఎగ్జయిట్‌మెంట్‌ను ఎంతగానో పెంచుతోంది. రామ్ చరణ్ ఈ చిత్రంలో రెండు పవర్‌ఫుల్ పాత్రల్లో మెప్పించనున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించిన ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.