మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Game Changer: మెగా మాస్‌ బ్లాస్ట్‌..వచ్చేస్తుంది

ABN, Publish Date - Mar 26 , 2024 | 01:49 PM

'జరగండి.. జరగండి' (Jaragandi Jaragandi) అంటూ దాదాపు నాలుగైదు నెలలుగా ప్రేక్షకుల్ని ఊరిస్తున్నారు 'గేమ్‌ ఛేంజర్‌ (Game changer)మేకర్స్‌'. గత నవంబర్‌లో దీపావళి కానుకగా 'జరగండి’ పాటను విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది.

'జరగండి.. జరగండి' (Jaragandi Jaragandi) అంటూ దాదాపు నాలుగైదు నెలలుగా ప్రేక్షకుల్ని ఊరిస్తున్నారు 'గేమ్‌ ఛేంజర్‌ (Game changer)మేకర్స్‌'. గత నవంబర్‌లో దీపావళి కానుకగా 'జరగండి’ పాటను విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. కారణాలు ఏమైనా గానీ ఆ పాట విడుదలకు నోచుకోలేదు. అభిమానులు దీనిపై మండిపడుతూ చిత్ర బృందాన్ని నిలదీశారు కూడా! ఫలితం లేకపోయింది. అయితే ఈ పాట ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎన్నో రోజులుగా 'గేమ్‌ ఛేంజర్‌' అప్‌డేట్‌ కావాలని కోరుతున్న అభిమానులకు దిల్‌ రాజు టీమ్‌ శుభవార్త చెప్పింది. బుధవారం ఉదయం 9 గంటలకు 'జరగండి జరగండి' పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మెగా మాస్‌ బ్లాస్ట్‌ రాబోతుంది అంటూ కొత్త పోస్టర్‌ను షేర్‌ చేశారు.  దీంతో రామ్‌చరణ్‌ అభిమానులు మంచి జోష్‌ మీదున్నారు. 


రామ్‌చరణ్‌ (Ram charan) హీరోగా శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. పొలిటికల్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Updated Date - Mar 26 , 2024 | 02:01 PM