Game Changer: గేమ్ ఛేంజర్‌ని దెబ్బేసిన 'పుష్ప 2'
ABN, Publish Date - Dec 06 , 2024 | 04:15 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బిహేవియర్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' కొంపముంచేలా ఉంది. ఇంతకీ ఏమైందంటే
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమాకి కష్టాలు తీసుకొచ్చింది. ఇటీవల అధిక టికెట్ ధరలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పుష్ప 2'కి ప్రేక్షకుల నుండి వ్యతిరేకత ఎదురైంది. అలాగే బెనిఫిట్ షోలతో హైదరాబాద్ లో జరిగిన గందరగోళంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'పై భారీ ప్రభావం చూపించనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏమైందంటే..
'పుష్ప-2' బెనిఫిట్ షో సందర్భంగా ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళా మృతి చెందారు. ఈ ఘటనలో అల్లు అర్జున్‌పై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ క్రమంలోనే తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఇక నుంచి బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వమంటూ సంచలన ప్రకటన చేశారు. దీంతో ఇది భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతికి రిలీజ్ కానున్న 'గేమ్ ఛేంజర్' సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపనుంది.ఫెస్టివల్ సీజన్ ని టార్గెట్ చేస్తూ, భారీ ఓపెనింగ్స్ తో లాభాలు రాబట్టాలనుకున్న నిర్మాత ఆశలన్నీ ఆవిరయ్యాయి. ఆఖరి నిమిషం వరకు దిల్ రాజు ఏదైనా మాయ చేస్తాడా అని అభిమానులు భావిస్తున్నారు. కానీ ఈ క్లిష్టతర పరిస్థితులలో బెనిఫిట్ షోల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు చరణ్ ఫ్యాన్స్ కొందరు మాకు బెనిఫిట్ షోస్ అవసరం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏపీలో ఎలాగో అన్ని షోలు ఉంటాయి. బిజినెస్ జరిగేది కూడా అక్కడే అంటున్నారు.