Devaki Nandana vasudeva: ప్రేక్షకుల ముందుకు గల్లా అశోక్‌..

ABN, Publish Date - Nov 28 , 2024 | 09:34 PM

తెరపై హ్యాండ్సమ్‌గా కనిపించడమే కాకుండా చక్కని భావోద్వేగాలు పండించాడనే ప్రశంస ప్రేక్షకుల నుంచి వినిపించింది. అయితే ఈ చిత్రం మొదటి రోజు అంతంత మాత్రంగానే ఉన్నా..

గతవారం మిడియం రేంజ్‌ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. మూడు సినిమాలు మూడు జానర్లు. వాటిలో మహేష్‌ బాబు మేనల్లుడు గల్లా అశోక్‌ (Galla Ashok)నటించిన ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) విభిన్న కథాంశంగా, మాస్‌ యాక్షన్‌ నేపథ్యంతో వచ్చిన ఈ సినిమా రిలీజ్‌ రోజు డీసెంట్‌ టాక్‌ తెచ్చుకుంది. గల్లా అశోక్‌ ‘హీరో’ సినిమాతో పోలిేస్త నటన పరంగా చాలా ఇంప్రూవ్‌ అయ్యాడు. తెరపై హ్యాండ్సమ్‌గా కనిపించడమే కాకుండా చక్కని భావోద్వేగాలు పండించాడనే ప్రశంస ప్రేక్షకుల నుంచి వినిపించింది. అయితే ఈ చిత్రం మొదటి రోజు అంతంత మాత్రంగానే ఉన్నా.. రెండో రోజుకి కలెక్షన్లు పుంజుకుని, మూడవ రోజుకి మరింత బాగా కలెక్షన్లు పెరిగాయని చిత్రబృందం చెబుతోంది. ప్రమోషన్స్‌లో మొదటి నెమ్మదిగా ఉన్న మేకర్స్‌ కలెక్షన్లు పెరుగుతున్న కొద్దీ సినిమాను ఆడియన్స్‌లోకి తీసుకెళ్లేందుకు ప్రమోషన్స్‌ స్పీడ్‌ పెంచారు. ముఖ్యంగా బీ,సీ సెంటర్స్‌లో దేవకీ నందన వాసుదేవ వీకెండ్‌ హౌస్‌ ఫుల్‌ బోర్డ్స్‌ కనిపించాయి. ఇక వర్కింగ్‌ డేస్‌ లోనూ డీసెంట్‌ కలెక్షన్స్‌ వసూలు చేస్తోంది. కమర్షియల్‌ సినిమా కి డివోషనల్‌ టచ్‌ ఇవ్వడం భారీ యాక్షన్‌ సీన్స్‌ మాస్‌ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకున్నాయని దర్శకుడు చెప్పారు. ఈ నేపథ్యంలో గల్లా అశోక్‌ కుమార్‌ రెండు తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్‌ టూర్‌ (Devaki Nandana Vasudeva Success Tour) చేపట్టాడు. అందులో భాగంగా థియేటర్స్‌ విజిట్‌ చేస్తున్నాడు. ఈ సక్సెస్‌ టూర్‌లో గల్లా అశోక్‌కు ప్రేక్షకులు బ్రమ్మరథం పడుతున్నారు. ఈ వారం మరే ఇతర సినిమాలు లేకపోవడంతో ుదేవకి నందన వాసువదేవ’ మరింత కలెక్షన్స్‌ రాబట్టే అవకాశం ఉంది’’ అని మేకర్స్‌ చెబుతున్నారు. 

Updated Date - Nov 28 , 2024 | 09:34 PM