మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Gaami-OTT: ఓటీటీలో... ఎప్పుడు.. ఎక్కడంటే!

ABN, Publish Date - Apr 02 , 2024 | 10:11 AM

విశ్వక్‌ సేన్  (Vishwak Sen) హీరోగా నటించిన సినిమా ‘గామి’ (Gaami) . ఇందు అఘోరాగా  మెప్పించారు. మార్చి 8న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణతోపాటు విమర్శకుల ప్రశంసలు అందుకొంది

విశ్వక్‌ సేన్  (Vishwak Sen) హీరోగా నటించిన సినిమా ‘గామి’ (Gaami) . ఇందు అఘోరాగా  మెప్పించారు. మార్చి 8న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణతోపాటు విమర్శకుల ప్రశంసలు అందుకొంది. తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా ‘గామి’ అని పలువురు ప్రశంసించారు. ఇప్పుడీ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్  కానుంది. ‘గామి’ డిజిటల్‌ స్ర్టీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ 5’ సొంతం చేసుకుంది. ఏప్రిల్‌ రెండో వారంలో ఈ చిత్రాన్ని వీక్షకుల ముందుకు తీసుకురానుంది. ఏప్రిల్‌ 12వ తేదీన డిజిటల్‌ రిలీజ్‌ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంక్రాంతి బ్లాక్‌ బస్టర్‌, తెలుగుతోపాటు పాన ఇండియా స్థాయిలో విజయం సాధించిన ‘హను-మాన్‌’ ఇటీవల ఓటీటీ వేదికగా అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ‘గామి’ యాడ్‌ అవుతోంది. విశ్వక్‌సేన సరసన చాందిని చౌదరి, ఎంజీ అభినయ, హారిక పెడదా, మహ్మద్‌ సమద్‌ ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులు. విద్యాధర్‌ కాగిత దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని వి సెల్యూలాయిడ్‌ సమర్పణలో కార్తీక్‌ కుల్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై కార్తీక్‌ శబరీష్‌ నిర్మించారు.


కథ: శంకర్‌ (విశ్వక్‌) అఘోరా. అతని శరీరానికి మనిషి స్పర్శ తగిలితే వింత మార్పులకు లోనవుతుంది. అసలు ఆ సమస్యకు మూల కారణం ఏమిటి? ఎలా దాని బారిన పడ్డాడు? తన గతం ఏమిటి? అనేది శంకర్‌కి గుర్తు లేదు. మూడు పుష్కరాలకు.. అంటే 36 ఏళ్లకు ఒక్కసారి హిమాలయాల్లోని ద్రోణ గిరి ప్రాంతంలో పూసే మాలి పత్రాలు అనే ప్రత్యేకమైన పువ్వుల్ని సేవిస్తే సమస్య తీరుతుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే భారత - చైనా సరిహద్దుల్లో ఎప్పుడూ మనుషులపై ప్రయోగాలు జరుగుతుంటాయి. అక్కడ నుంచి సీటీ 333 (మహ్మద్‌ సమద్‌) అనే టెస్ట్‌ సబ్జెక్ట్‌ ఎలాగైనా తప్పించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. అతనితో పాటు దక్షిణ భారతదేశంలో ఓ గ్రామంలోని దేవదాసి దుర్గ (అభినయ), ఆమె కుమార్తె ఉమ (హారిక)లది మరో కథ. ఈ మూడు కథలకు సంబంధం ఏంటి? ఎలా ఒక్కటి అయ్యాయి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 

Updated Date - Apr 02 , 2024 | 10:15 AM