AAY Movie: ‘ఆయ్’ ఆగ‌స్ట్ 15న వ‌స్తున్నామండి.. రెడీగా ఉండండి మ‌రి

ABN, Publish Date - Jun 25 , 2024 | 01:53 PM

మ్యాడ్‌ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌ర్వాత యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ బావ మ‌రిది నార్నే నితిన్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం ‘ఆయ్’. ప్ర‌తిష్టాత్మ‌క GA2 పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిత‌మైంది. తాజాగా సినిమా విడుద‌ల తేదీని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

AAY Movie

మ్యాడ్‌ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌ర్వాత యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ బావ మ‌రిది నార్నే నితిన్ (Narne Nithiin) హీరోగా న‌టిస్తోన్న చిత్రం ‘ఆయ్’(AAY). ప్ర‌తిష్టాత్మ‌క GA2 పిక్చర్స్ (GA2 Pictures)బ్యానర్‌పై బన్నీ వాస్ (Bunny Vas), విద్యా కొప్పినీడి (Vidya Koppineedi) ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తుండ‌గా. అంజి కె.మ‌ణిపుత్ర (Anji Kanchipalli) దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. నయన్ సారిక (Nayan Sarika) క‌థానాయిక‌గా చేస్తోండ‌గా రామ్ మిర్యాల (Ram Miriyala) సంగీతం అందిస్తున్నారు.

ఇప్ప‌టికే ‘ఆయ్’ (AAY) సినిమా నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు సూప‌ర్బ్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంటుండ‌డ‌మే కాక‌ సోష‌ల్ మీడియాలో రీల్స్‌, షార్ట్స్ రూపంలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. దీంతో సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ క్ర‌మంలో సినిమా విడుద‌ల తేదీని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అయితే ఆ రోజు (ఆగ‌స్ట్ 15న) రిలీజ్ కావాల్సి ఉన్న పుష్ప 2 ది రూల్ చిత్రం డిసెంబ‌ర్ నెల‌కు వాయిదా ప‌డ‌డంతో చిన్న‌, మీడియం రేంజ్ చిత్రాలు చాలా థియేట‌ర్ల బాట ప‌ట్టాయి. ఈ క్ర‌మంలో ఇప్పుడు ఆయ్ చిత్రం బృందం త‌మ సినిమా విడుద‌ల తేదీని అధికారికంగా ప్ర‌క‌టించింది.


గోదావ‌రి బ్యాక్‌డ్రాప్‌తో ఫ‌న్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాను స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 15న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆగ‌స్ట్ 15న గురువారం సెల‌వు కావ‌డం, ఆ త‌ర్వాత రోజు నుంచి వీకెండ్ ప్రారంభం అవుతుంది. ఆపై సోమ‌వారం రోజున ర‌క్షా బంధ‌న్ కూడా ఉండ‌డంతో ఆ ఐదారు రోజులు సినిమాకు మంచిగా క‌లిసి వ‌స్తుంద‌ని మేక‌ర్స్ బావిస్తున్నారు.

Updated Date - Jun 25 , 2024 | 01:57 PM