Devara: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. ఈరోజు నుంచి ‘దేవర’లో దావుది సాంగ్‌

ABN, Publish Date - Oct 04 , 2024 | 07:42 AM

‘దేవర’ బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సొంతం చేసుకున్న నేప‌థ్యంలో తాజాగా మేకర్స్ ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ రోజు (శుక్ర‌వారం) నుంచి దావూది అంటూ పాట‌ను జ‌త చేస్తున్న‌ట్లు తెలిపారు.

devara

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘దేవర’(Devara). కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వం, జాన్వీ క‌పూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌గా ఇటీవ‌ల ప్రేక్ష‌కుల మందుకు వ‌చ్చిన ఈ చిత్రం బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌. సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా సెప్టెంబ‌ర్ 27న వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాండ్‌గా విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ క్ర‌మంలో గురువారం రాత్రి దేవ‌ర టీమ్ అంతా హైద‌రాబాద్ పార్క్ హ‌య‌త్‌లో గ్రాండ్ పార్టీ చేసుకుంది.


తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. సినిమాలో ఈ రోజు (శుక్ర‌వారం) నుంచి దావూది అంటూ పాట‌ను జ‌త చేస్తున్న‌ట్లు తెలిపారు. ఎన్టీఆర్‌, జాన్సీ క‌పూర్‌ల‌పై చిత్రీక‌రించిన ఈ లిరిక‌ల్ వీడియోను సినిమా విడుద‌ల‌కు ముందే రిలీజ్ చేయ‌గా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇద్ద‌రు పోటీపడి మరీ ఈ పాటలో చిందులు వేశారు.

తీరా మూవీ రిలీజ్ అయ్యాక చూస్తే సినిమాలో పాట లేక‌పోవ‌డంతో ఫ్యాన్స్ ఆగ్ర‌హాం వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ తిరిగి ఆ పాట‌ను సినిమాలో క‌ల‌పాల‌ని భావించింది. ఈ క్ర‌మంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా ప్ర‌ద‌ర్శిస్తున్న అన్ని థియేట‌ర్ల‌లో ఈ రోజు (శుక్ర‌వారం) నుంచి దావుది (Daavudi) పాట‌ను జ‌త చేయ‌నున్నారు.

Updated Date - Oct 04 , 2024 | 07:42 AM