మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections - Pawan kalyan: సినీరంగం నుంచి ఒక్కొక్కరు బయటికొస్తున్నారు

ABN, Publish Date - May 07 , 2024 | 04:57 PM

ఆంధ్రప్రదేశలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా  సాగుతోంది. గెలుపు కోసం పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటిగా ఉంది.

ఆంధ్రప్రదేశలో ఎన్నికల (Ap Elections 2024) ప్రచారం వాడివేడిగా  సాగుతోంది. గెలుపు కోసం పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం (Pitapuram- Pawan kalyan)ఒకటిగా ఉంది. పవన్‌ కళ్యాణ్‌ గెలుపు కోసం ఎన్డీయే కూటమి, మెగా ఫ్యామిలీ, అభిమానులు కష్టపడుతుంటే.. పవన్‌ను ఓడించడమే టార్గెట్‌గా పెట్టుకుని వైసీపీ వ్యూహలు పన్నుతోంది. ఈ క్రమంలో జనసేనాని (janasena) కల్యాణ్‌కు మద్దతు పెరుగుతోంది. సినీ ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా పవన్‌ కళ్యాణ్‌ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. పవన్  కల్యాణ్‌ అభిమానులు హైపర్‌ ఆది, సుడిగాలి సుధీర్‌, రాంప్రసాద్‌తోపాటు పలువురు జబర్దస్ట్‌ ఆర్టిస్ట్‌లు పవన్   తరుపున ప్రచారం చేస్తున్నారు. అలాగే మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు భార్య పద్మజా, వరుణ్‌తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. పిఠాపురం తో పాటు పలు నియోజకవర్గాల్లో మెగా హీరోలు ప్రచారం ముమ్మరం చేశారు. తాజాగా చిరంజీవి రంగంలోకి దిగారు. తన తమ్ముడిని గెలిపించాలంటూ ఈ వీడియో షేర్‌ చేశారు. ఇటీవల సీఎం రమేష్‌కు, పంచకర్ల రమేష్‌ మద్దతు పలికిన చిరంజీవి ఇప్పుడు పవన్ కళ్యాణ్  కోసం రంగంలోకి దిగారు. ఇప్పటివరకు బహిరంగంగా ఎవరికి మద్దతు అనే దానిపై చిరంజీవి స్పందించలేదు. తొలిసారి తన తమ్ముడి గెలిపించాలని పిఠాపురం ఓటర్లను చిరంజీవి కోరారు.

మీ భవిష్యత్తు కోసం ఆయన: రామ్‌చరణ్‌(Ram Charan)
తాజాగా రామ్‌చరణ్‌ కూడా పవనకు మద్దతుగా ట్వీట్‌ చేశారు. మీ భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు పవనకల్యాణ్‌గారిని గెలిపించండి’ అని ట్విట్టర్‌ వేదికగా ఓటర్లను కోరారు.



రాజకీయ యుద్థాన్ని ఎదుర్కోనున్నారు: నాని
జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు హీరో నాని ఎక్స్‌ వేదికగా తెలిపారు. ‘పవన్‌ కల్యాణ్‌గారూ.. మీరు పెద్ద రాజకీయ యుద్థాన్ని ఎదుర్కోనున్నారు. మీ సినిమా కుటుంబ సభ్యుడిగా మీరు కోరుకున్న విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నా. మీ వాగ్దానాలన్నింటినీ నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నా. మీకు ఎంతోమంది ప్రేమాభిమానాలు తోడున్నాయి. నా మద్దతు మీకే. ఆల్‌ ది బెస్ట్‌ సర్‌’ అని నాని ట్వీట్‌ చేశారు.

ఇప్పుడు జనానికి నువ్వు కావాలి: రాజ్‌ తరుణ్‌
‘ఆంధ్రప్రదేశ్‌ శ్రేయస్సు కోసం మీ కృషిని, ప్రయత్నాలను మొదటి రోజు నుంచి చూస్తున్నాను. కోట్ల మందికి మీరు ఒక ఆశ. మీరు గెలిచి ప్రజల తలరాతలను మార్చాలని కోరుకుంటున్నాను. ఇప్పటి జనాలకు మీరు కావాలి’ అని హీరో రాజ్‌ తరుణ్‌ ఎక్స్‌ వేదికగా జనేసనకు సపోర్ట్‌ చేశారు. అలాగే పవన్‌కు మద్దతు తెలుపుతున్నట్లు నటుడు తేజ సజ్జా తన ఇన్‌స్టా స్టోరీ పెట్టారు.  

నిర్మాత నాగవంశీ కూడా పవన్ కు  మద్దతు పలికారు. ఈ రోజు సాయంత్రం ఆయన పిఠాపురం వెళ్లబోతున్నట్లు ట్వీట్‌లో తెలిపారు. ఆయన భారీ మెజారిటీతో గెలవాలని వంశీ అభిలషించారు. 

పోరాటపటిమ ఎప్పటికీ స్పూర్తి: సంపూర్ణేష్ బాబు

"ఎన్ని అడ్డంకులు వచ్చినా .. ప్రజాపోరాటం నుంచి వెనక్కు తగ్గని మీ పోరాటపటిమ ఎప్పటికీ స్పూర్తి , రానున్న ఎన్నికలలో జనసేనానికి అన్ని శుభాలు జరగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను సదా మీ ప్రేమకి బానిస"

Updated Date - May 07 , 2024 | 04:57 PM