Darshan Case: మానసిక సమస్యలు.. నిజమా? డ్రామానా?

ABN, Publish Date - Jun 23 , 2024 | 01:05 PM

రేణుకాస్వామి హత్య కేసు కన్నడనాట ఎంతగా సంచలనం సృష్టించిందో తెలిసిందే! దర్శన్‌కు జ్యుడీషియల్‌ కస్టడీ ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.



రేణుకాస్వామి (Renuka Swami) హత్య కేసు కన్నడనాట ఎంతగా సంచలనం సృష్టించిందో తెలిసిందే! దర్శన్‌కు (Darshan) జ్యుడీషియల్‌ కస్టడీ ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. జులై 4 వరకు పరప్పన అగ్రహారం జైలులో ఆయన ఉండనున్నారు. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌ ఎ2గా, ఆయన ప్రియురాలు పవిత్ర గౌడ ఎ1గా పోలీసులు నిర్ధారించారు. వీరిద్దరితోపాటు మరో 15 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తాజాగా దర్శన్‌ మానసిక పరిస్థితి గురించి పలు విషయాలు బయటకు వస్తున్నాయి. దర్శన్‌కు మానసిక ఆరోగ్య సమస్యలున్నాయని, తగిన వైద్యం అవసరమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 10వ తేదీన రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్‌ అయ్యాక దర్శన్‌ మానసిక పరిస్థితి చర్చకు వచ్చింది. గతంలో దర్శన్‌ గొడవపడిన ఘటనలు, షూటింగ్‌లో ఇతరులను కొట్టిన సంగతులు, అతని పట్టలేని ఆగ్రహం చూేస్త మానసిక రోగంతో బాధపడుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయని గతంలో దర్శన్‌కు కౌన్సిలింగ్‌ ఇచ్చిన మానసిక వైద్యురాలు చంద్రిక ఈ విషయాన్ని బయటపెట్టారు. చిన్న చిన్న విషయాల్లో అతిగా స్పందించడం, కోపం రావడం తదితర లక్షణాలు ఉండేవని, అయితే అతడి స్టార్‌డమ్‌ కారణంగా అవి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదని, అందుకే దర్శన్‌ ఇంతవరకూ వచ్చాడంటున్నారు. కౌన్సెలింగ్‌ కొనసాగించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. కోపం వస్తే దర్శన్‌ విచక్షణ మర్చిపోతారని, ఏం చేస్తున్నాడో అతడికే తెలీదన్నారు. తక్షణం అతడికి కౌన్సెలింగ్‌, వైద్యం చాలా అవసరమని పలువురు పేర్కొన్నారు.



13 ఏళ్ల క్రితం భార్యపై దాడి కేసులో అరెస్ట్‌ అయ్యి జైలు పాలయ్యాడు. ఇప్పుడు మళ్లీ అదే జైలుకి వెళ్లాడు. హత్య కేసులో ప్రథమ ముద్దాయి, దర్శన్‌ ప్రియురాలు పవిత్రగౌడ ఇప్పటికే పరప్పన జైలులో ఉన్నారు. మరోవైపు బెయిల్‌ కోసమే దర్శన్‌ ఆరోగ్య సమస్యలు, మానసిక పరిస్థితి బాగులేదనే కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. మానసిక పరిస్థితి బాగులేదనే అధికారికంగా ప్రభుత్వ వైద్యులు ధృవీకరిేస్త తప్పకుండా దర్శన్‌కు బెయిల్‌ వచ్చే అవకాశం ఉందని పలువురు న్యాయవాదులు కూడా అభిప్రాయపడుతున్నారు.  ఇప్పుడు బెయిల్‌ కోసమే ఆ డ్రామా ఆడుతున్నారనే కామెంట్స్‌ వస్తున్నాయి.

Updated Date - Jun 23 , 2024 | 01:06 PM