మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Directors day: ఈసారి నభూతో నభవిష్యత్‌ అన్న రీతిలో.. 

ABN, Publish Date - Apr 23 , 2024 | 09:29 AM

"భారతీయ సినిమాకి డైరెక్టర్స్‌ డే అనేది తలమానికం. తెలుగు ఇండస్ట్రీలో తప్ప ఇతర భాషల్లో ఎక్కడా ఇలాంటి ప్రయత్నం జరగలేదు. దీనికి కారణం 150 చిత్రాలకు దర్శకత్వం వహించి, తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి, గిన్నిస్‌ బుక్‌ రికార్డ్‌ సాధించిన ఏకైక దర్శకుడు దాసరి నారాయణరావు.


"భారతీయ సినిమాకి డైరెక్టర్స్‌ డే (Directors day) అనేది తలమానికం. తెలుగు ఇండస్ట్రీలో తప్ప ఇతర భాషల్లో ఎక్కడా ఇలాంటి ప్రయత్నం జరగలేదు. దీనికి కారణం 150 చిత్రాలకు దర్శకత్వం వహించి, తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి, గిన్నిస్‌ బుక్‌ రికార్డ్‌ సాధించిన ఏకైక దర్శకుడు దాసరి నారాయణరావు(Dasari Narayanarao) . ఆయన పేరు మీదే  డైరెక్టర్స్‌ డే చేయాలనుకున్నాం’’ అని దర్శకుల సంఘం పూర్వ అధ్యక్షుడు ఎన్.శంకర్‌, ప్రస్తుత అధ్యక్షుడు వీరశంకర్‌ అన్నారు. అగ్ర దర్శకుడు దాసరి నారాయణరావు పుట్టినరోజు సందర్భంగా మే 4న హైదరాబాద్‌లోని ఎల్‌.బి స్టేడియంలో డైరెక్టర్స్‌ డే వేడుకల్ని నిర్వహిస్తున్నారు. ఆ వేడుకకి సంబంధించిన వివరాలు సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. పలువురు దర్శకులు పాల్గొనగా సీనియర్‌ రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్‌ చేతులమీదుగా టీఎఫ్‌డీఎ.ఇన్‌ వెబ్‌సైట్‌ని ప్రారంభించారు. "అందరి సహకారంతో ఐదేళ్లుగా ఈ వేడుకను ఘనంగా జరుపుతున్నాం. ఈసారి నభూతో నభవిష్యత్‌ అన్న రీతిలో పరిశ్రమనంతా కలుపుకొని ఆ  వేడుకల్ని నిర్వహిస్తున్నాం’’ అని దర్శకుల సంఘం అధ్యక్షుడు చెప్పారు.

ఈ సంఘం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రభాస్‌ రూ.35 లక్షలు విరాళం ప్రకటించినట్టు దర్శకుడు మారుతి తెలిపారు. ఈ కార్యక్రమంలో రేలంగి నరసింహారావు, హరీశ్‌శంకర్‌, రామ్‌ప్రసాద్‌, వి.ఎన్‌.ఆదిత్య, రాజా వన్నెంరెడ్డి, సముద్ర, దశరథ్‌తోపాటు యువ దర్శకులు పాల్గొన్నారు. 

Read More: Cinema News, Tollywood

Updated Date - Apr 23 , 2024 | 09:52 AM