మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Director Yeshasvi: చెన్నైలో ఉండి బతికిపోయాడంటూ కామెంట్‌!

ABN, Publish Date - Feb 22 , 2024 | 05:09 PM

సంగీత దర్శకుడు రథన్‌(Radhan)పై నూతన దర్శకుడు వి.యశస్వి (V.Yashasvi) ఫైర్‌ అయ్యారు. తాను తెరకెక్కించిన ‘సిద్థార్థ్‌ రాయ్‌’ (Siddharth roy) సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మ్యూజిక్‌ డైరెక్టర్‌పై ఆరోపణలు చేశారు.

సంగీత దర్శకుడు రథన్‌(Radhan)పై నూతన దర్శకుడు వి.యశస్వి (V.Yashasvi) ఫైర్‌ అయ్యారు. తాను తెరకెక్కించిన ‘సిద్థార్థ్‌ రాయ్‌’ (Siddharth roy) సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మ్యూజిక్‌ డైరెక్టర్‌పై ఆరోపణలు చేశారు. అతను చెన్నైలో ఉండి బతికిపోయాడని, ఇక్కడ ఉండి ఉంటే గొడవలు అయ్యేవని ఆయన అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘మా సినిమా షూటింగ్‌ త్వరగానే పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ మాత్రం చాలా ఆలస్యమైంది. దానికి కారణం సంగీత దర్శకుడు రథన్‌. నాలా ఇంకెవరూ మోసపోవద్దని అతని గురించి చెబుతున్నా. అతడు అద్భుతమైన టెక్నీషియన్‌ కావొచ్చు. కానీ, ఇలా చేయడం వల్ల సినిమా కిల్‌ అవుతుంది. అతను ఎప్పుడూ గొడవ పడేందుకే మాట్లాడతాడు’’ అని అన్నారు. రథన్‌ తీరుపై దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కూడా గతంలో అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘

అర్జున్‌ రెడ్డి’ విషయంలో అనుకున్న సమయాని కంటే చాలా ఆలస్యంగా ట్యూన్స్‌ ఇచ్చారని, అందుకే నేపథ్య సంగీతాన్ని హర్షవర్థన్‌ రామేశ్వర్‌తో చేయించామని చెప్పారు. గతంలో రధన ‘అందాల రాక్షసి’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘హుషారు’, ‘జాతి రత్నాలు’, ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ తదితర సినిమాలకు పనిచేశారు. వి.యశస్వి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ‘అతడు’, ‘ఆర్య’, ‘భద్ర’, ‘లెజెండ్‌’ తదితర చిత్రాల్లో బాల నటుడిగా అలరించిన దీపక్‌ సరోజ్‌ ‘సిద్థార్థ్‌ రాయ్‌’తో హీరోగా మారారు. కొత్తతరం ప్రేమకథతో రూపొందిన ఈ సినిమాలో తన్వి నేగి హీరోయిన్‌గా నటిస్తోంది. ఫిబ్రవరి 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - Feb 22 , 2024 | 05:51 PM