Ratan Tata: తరతరాలు నిలిచిపోయే గుర్తును మిగిల్చారు! సెల్యూట్ సార్‌.. టాటా మృతిపై రాజ‌మౌళి భావోద్వేగ పోస్ట్‌

ABN, Publish Date - Oct 10 , 2024 | 07:27 AM

భారత దేశ పారిశ్రామిక దిగ్గ‌జం రతన్‌ టాటా ఈ తెల్ల‌వారుజామున 12 గంట‌ల‌కు తుదిశ్వాస విడిచిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా తెలుగు ద‌ర్శ‌క‌ధీరుడు రాజామౌళి స్పందించి ర‌త‌న్ టాటాకు నివాళుల‌ర్పించారు.

rajamouli

భారత దేశ పారిశ్రామిక దిగ్గ‌జం జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య యవనికపై తనదైన ముద్ర వేసిన పారిశ్రామిక వేత్త, చైర్మన్‌ ఎమెరిటస్‌ ఆఫ్‌ టాటా సన్స్‌.. రతన్‌ టాటా (86) (Ratan Tata) ఈ తెల్ల‌వారుజామున 12 గంట‌ల‌కు తుదిశ్వాస విడిచిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా తెలుగు ద‌ర్శ‌క‌ధీరుడు రాజామౌళి (ssrajamouli) స్పందించారు. త‌న సానుభూతిని తెలుపుతూ, టాటా సేవ‌ల‌ను కొనియాడుతూ త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ పోస్టు పెట్టి ర‌త‌న్ టాటా (Ratan Tata)కు నివాళుల‌ర్పించారు.

లెజెండ్స్ పుడతారు .. వారు ఎప్పటికీ జీవిస్తారు. టాటా ఉత్పత్తిని ఉపయోగించకుండా ఒక రోజును ఊహించడం కష్టం.. రతన్ టాటా వారసత్వం మా రోజువారీ జీవితంలో బాగమైంది. పంచభూతాలతో పాటు ఎవరైనా కాలపరీక్షకు నిలబడతారంటే అది ఆయనే. భారతదేశం కోసం మీరు చేసిన ప్రతిదానికీ.. మరియు లెక్కలేనన్ని జీవితాలను ప్రభావితం చేసినందుకు ధన్యవాదాలు సర్. మీరు తరతరాలుగా నిలిచిపోయే గుర్తును మిగిల్చారు. మీకు సెల్యూట్.. ఎల్లవేళలా మీకు ఆరాధకుడినే.. జై హింద్ అంటూ రాజ‌మౌళి (ssrajamouli) త‌న ఎక్స్ అకౌంట్‌లో పోస్టు చేశారు

Updated Date - Oct 10 , 2024 | 12:28 PM