Rajamouli: సూర్య వల్లే ‘బాహుబలి’.. అత‌నితో సినిమా ఛాన్స్‌ మిస్‌ అయ్యా

ABN, Publish Date - Nov 08 , 2024 | 08:02 AM

సూర్య స్ఫూర్తితోనే నేను పాన్ ఇండియా సినిమాల‌కు పూనుకున్నాన‌ని రాజ‌మౌళి సూర్య‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఈ సంఘ‌ట‌న నిన్న హైద‌రాబాద్ ‘కంగువ’చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జ‌రిగింది.

rajamouli

సూర్య స్ఫూర్తితోనే నేను పాన్ ఇండియా సినిమాల‌కు పూనుకున్నాన‌ని రాజ‌మౌళి సూర్య‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఆయ‌న ప‌ని తీరును, సినిమా ప్ర‌మోష‌న్ కోసం అత‌ను ప‌డు క‌ష్టాన్ని చాలాసార్లు గ‌మ‌నించానంటూ ఆయ‌న‌ను ఆకాశానికెత్తేశారు. ఈ సంఘ‌ట‌న నిన్న హైద‌రాబాద్ ‘కంగువ’ (Kanguva)చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జ‌రిగింది. చాలా విరామం త‌ర్వాత సూర్య నటిస్తోన్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’ (Kanguva). భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు శివ రూపొందించారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించ‌గా.. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేప‌థ్యంలోనే గురువారం హైద‌రాబాద్‌లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు. ఈ వేడుక‌కు టాలీవుడ్ నుంచి రాజ‌మౌళి, అల్లు అర‌వింద్‌, దిల్ రాజు, సురేశ్ బాబు, విశ్వ‌క్‌సేన్‌, సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, బోయ‌పాటి శీను వంటి మ‌హామ‌హులు హ‌జ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. ‘తెలుగు సినిమాను కేవ‌లం ఆంధ్ర‌, తెలంగాణ‌ రాష్ట్రాలలోనే ఉంచ‌కుండా బ‌య‌టి ప్రపంచానికి తీసుకురావ‌డానికి కార‌ణం వ‌న్ ఆఫ్ ది మెయిన్ రీజ‌న్ సూర్య. చాలా సంవ‌త్స‌రాలు.. చాలా సార్లు ప్ర‌త్యేకించి ‘గజిని’ సినిమావిడుదల సమయంలో ఆయన చేసిన ప్రచారాన్ని బాగా పరిశీలించా. ఓ త‌మిళ‌ నటుడు తెలుగు ప్రేక్షకులకు ఎలా దగ్గర కాగలిగాడు? అనే దాన్ని కేస్ స్టడీగా తీసుకోమని మ‌నం కూడా అక్క‌డికి వెల్లి ప్ర‌మోష‌న్స్ చేయాల‌ని ప‌క్క నున్న వారికి చెప్పేవాడిన‌ని అలా ‘బాహుబలి’ (Baahubali) సినిమాకు ఆయనే ఇన్‌స్పిరేషన్ అని అన్నారు. మేమిద్ద‌రం క‌లిసి గ‌తంలో ఓ సినిమా చేయాలనుకున్నాం. కానీ, కుదర్లేదు. ‘నేను అవకాశం మిస్‌ అయ్యా’ అంటూ సూర్య నా గురించి ఓ ఈవెంట్‌లో అన్నారు. ఆయన మిస్‌ అవడం కాదు.. నేనే ఛాన్స్‌ మిస్‌ అయ్యా’ అని అన్నారు.


‘సూర్య నటన, ఆయ‌న క‌థ‌లు ఒక‌దాని త‌ర్వాత మ‌రో డిఫ‌రెంట్ కాన్సెప్ట్ క‌థ‌ల‌ను ఎంచుకునే విధానం నాకు చాలా ఇష్టమ‌ని అన్నారు. ‘కంగువా’ టీమ్ ఎంత కష్టపడిందో మేకింగ్‌ వీడియో చూస్తేనే అర్థమవుతోందని. వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది వారు పెట్టిన ఖ‌ర్చుకు ప్ర‌తి రూపాయి రెండింత‌లు అయి వ‌స్తుంద‌న్నారు. చివ‌ర‌గా ఇలాంటి భారీ ప్రాజెక్టుల విషయంలో సాంకేతిక నిపుణులను దర్శకుడు ఎంతగా టార్చర్‌ చేస్తాడో నాకు తెలుసు’ నవ్వులు పూయించారు. నాకు సూర్య‌తో ఇంకా చాలా సేపు ఇక్క‌డ ఉండాల‌ని ఉంది కానీ అత్య‌వ‌స‌ర ప‌ని నిమిత్తం త్వ‌ర‌గా వెళుతున్నాను మ‌రోసారి క‌లుస్తాను. టీం అంద‌రికీ బెస్టాఫ్ ల‌క్‌.. సినీ ల‌వ‌ర్స్ ఈ సినిమాను ఎట్టి ప‌రిస్తితుల్లోనూ థియేట‌ర్‌లోనే చూడండ‌ని కోరారు.

అనంత‌రం రాజమౌళి స‌మ‌క్షంలోనే సూర్య మాట్లాడుతూ.. ‘సర్‌.. నేను ట్రైన్‌ మిస్‌ అయ్యా (రాజమౌళితో సినిమా చేయలేకపోవడం). ఇప్పటికీ రైల్వే స్టేషన్‌లోనే నిల్చొని ఉన్నా. ఏదో ఒక రోజు ట్రైన్‌ ఎక్కుతానని అనుకుంటున్నా. మనలో చాలామంది కుటుంబ సభ్యుల ఫొటోలో, దేవుడి చిత్రాలో ఫోన్‌లో వాల్‌ పేపర్‌గా పెట్టుకుంటాం. కొంతకాలంగా మా సినిమా నిర్మాత జ్ఞానవేల్‌ మీ ఫొటో పెట్టుకున్నారు. ‘కంగువా’లాంటి సినిమాలు రూపొందించేందుకు మీరే దారి చూపారు’ అంటూ ప్రశంసించారు. మీరు ప్ర‌త్య‌కంగా మీ స‌మ‌యాన్ని వెచ్చించి ఇక్క‌డ‌కు వ‌చ్చిన ధ‌న్య‌వాదాలు అని అన్నారు.

Updated Date - Nov 08 , 2024 | 03:31 PM