EVOL: 18 ఏళ్ళ మైండ్‌ ఉన్న వాళ్ల కోసం తీశా!  

ABN, Publish Date - Jun 23 , 2024 | 09:14 AM

కథ కొత్తగా ఉండి, తెరపై దర్శకుడు ఆవిష్కరించిన తీరు బావుంటే చిన్న పెద్ద సినిమా అనే తేడా చూడకుండా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. EVOL అలాంటి చిత్రమే అంటున్నారు దర్శకనిర్మాత రామయోగి వెలగపూడి

కథ కొత్తగా ఉండి, తెరపై దర్శకుడు ఆవిష్కరించిన తీరు బావుంటే చిన్న పెద్ద సినిమా అనే తేడా చూడకుండా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. EVOL అలాంటి చిత్రమే అంటున్నారు దర్శకనిర్మాత రామయోగి వెలగపూడి (Ram yogi Velagapudi). సూర్య శ్రీనివాస్‌, శివ బొడ్డు రాజు హీరోలుగా, జెనిఫర్‌ ఇమ్మానుయేల్‌ కథానాయికగా నటించిన చిత్రం EVOL. తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌కి చక్కని స్పందన వచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రామయోగి మాట్లాడుతూ "నిజ జీవితంలో జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందించాం. ఇద్దరు స్నేహితుల మధ్య అండర్‌స్టాండింగ్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. కథ కొత్తగా ఉంటుంది. వాణిజ్య విలువలతో క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఆద్యంతం ఉత్కంఠగా సాగుతోంది. హైదరాబాద్‌, వైజాగ్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. ట్రైలర్‌ చూసి రామ్‌గోపాల్‌ వర్మ నచ్చలేదన్నారు. క్లాసిక్‌గా తీశావ్‌ కాస్త మాస్‌ అంశాలు జోడించాల్సింది అన్నారు. నేను రాసుకున్న కథను ఎలా తెరకెక్కిస్తే బావుంటుందో అలాగే తీశా. అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్‌ అయింది. యువతను బాగా అలరించే సినిమా అవుతుందని నమ్ముతున్నా’’ అన్నారు.

ఇంకా దర్శకుడు మాట్లాడుతూ "నేను ఒక జానర్‌ సినిమా అనుకున్నా. వయసు కాదు మైండ్‌ 18 ఏళ్లు ఉన్న వారిని టార్గెట్‌ చేసుకుని సినిమా తీశా. దర్శకుడిగా ఏం చెప్పాల్లో, ఎలా చెప్పాలనుకున్నానో అదే తెరపై చూపించా. బడ్జెట్‌ 70 లక్షలు అనుకుని దిగాను.  కానీ రూ. 2.3 కోట్లు ఖర్చు అయింది. రికవరీ అవుతానో, లేదో అని కూడా ఆలోచించలేదు. విజువల్‌ క్వాలిటీ కోసం ఎక్కువ ఖర్చు చేశా. దర్శకుడిగా నేను తీయాలనుకున్నది తీశానంతే. వంద శాతం నాకు నష్టం తెచ్చే చిత్రమిది’’ అని అన్నారు. తేడా బ్యాచ్‌ సినిమా సమర్పణలో నక్షత్ర ఫిల్మ్‌ ల్యాబ్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్‌ పూర్తిచేసుకుని విడుదలకు సిద్థంగా ఉంది. 

Updated Date - Jun 23 , 2024 | 10:03 AM