Pailam Pilaga: ’పైలం పిల‌గా‘ టీజ‌ర్ వ‌దిలిన‌.. హరీష్ శంకర్

ABN, Publish Date - Sep 10 , 2024 | 07:58 PM

సాయి తేజ, పావని కరణం జంటగా నటించిన చిత్రం పైలం పిలగా. టాలీవుడ్, బాలీవుడ్ అగ్ర నటులతో  వందకు పైగా యాడ్ ఫిలిమ్స్ చేసిన‌ ఆనంద్ గుర్రం మొదటి సారి ఈ సినిమాకు దర్శకత్వం వ‌హించాడు. తాజాగా ఈమూవీ టీజ‌ర్‌ను హరీష్ శంకర్ లాంచ్ చేశారు. 

Pailam Pilaga

నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ వంటి టాలీవుడ్, ఇంకా చాలా మంది బాలీవుడ్ అగ్ర నటులతో సహా వందకు పైగా యాడ్ ఫిలిమ్స్ డైరెక్ట్ చేసిన‌ ఆనంద్ గుర్రం (Anand Gurram) మొదటి సారి దర్శకత్వం వ‌హిస్తూ తెర‌కెక్కించిన చిత్రం పైలం పిలగా (Pailam Pilaga) హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రామకృష్ణ బొద్దుల, ఎస్.కే. శ్రీనివాస్ ఈ సినిమాను నిర్మించ‌గా సాయి తేజ కల్వకోట (Sai Teja), పావని కరణం (Pavani Karanam) జంటగా నటించారు. డబ్బింగ్  జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ ఇతర పాత్రల్లో నటించారు. యశ్వంత్ నాగ్ (Yashwanth Nag) సంగీతం అందించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్ర‌మంలో తాజాగా ఈ మూవీ టీజర్‌ని హరీష్ శంకర్ (Harish Shankar) లాంచ్ చేశారు. 

చిన్న సినిమా అయినప్పటికీ ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన మూడు పాటలు మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకున్నాయి. టీజర్ రిలీజ్ సందర్బంగా హరీష్ శంకర్ (Harish Shankar) మాట్లాడుతూ.. టీజర్ చూస్తుంటే సినిమాని చాలా సహజంగా చిత్రీకరించారు అనిపిస్తుంది. 

టీజర్ చాలా చాలా ఎంటర్టైనింగ్ గా, టైటిల్ క్యాచిగా ఉంది, మంచి డైలాగ్స్ ఉన్నాయి. మొక్కల్నే అంత మంచిగా చూసుకుంటే మొగుణ్ణి ఇంకెంత మంచిగా చూసుకుంటుంది అనే డైలాగ్ నాకు బాగా నచ్చింది అంటూ పైలం పిలగా (Pailam Pilaga) సినిమా టీంని అభినందించారు.  


ఈ ప్రపంచంలో అత్యంత విలువైంది డబ్బు.. ఒక చిన్న పల్లెను పాలించాలన్న, మొత్తం ప్రపంచాన్ని శాసించాలన్నా జేబు నిండుగా ఉండాలి.  ఈ సత్యం గ్రహించి తెలంగాణ పల్లెలో పుట్టి పెరిగిన ఓ పిలగాడు దుబాయ్ వెళ్లి లక్షలు, కోట్లు సంపాదించాలని, అక్కడికి వెళ్ళడానికి కావాల్సిన డబ్బు కోసం చేసే ప్రయత్నంలో తాను ఒక్కడే  కాదు ఊరంతా బాగుపడే వ్యాపార అవకాశం దొరికి, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునే క్రమంలో బ్యూరోక్రసీ సిస్టమ్‌లో ఇరుక్కొని ప్రేమించిన అమ్మాయిని,  కుటుంబాన్ని కూడా దూరం చేసుకునే పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడో తెలిపే హాస్యభరిత వ్యంగ చిత్రంగా ఈ పైలం పిలగా (Pailam Pilaga) తెర‌కెక్కింది. 

Updated Date - Sep 10 , 2024 | 08:05 PM