Bose Veerapaneni: ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ ఎన్టీయార్ సన్నిహితుడు మృతి

ABN, Publish Date - Nov 12 , 2024 | 12:27 PM

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. సూపర్ స్టార్ కృష్ణకి బ్లాక్ బస్టర్ హిట్లు అందించిన స్టార్ డైరెక్టర్, సీనియర్ ఎన్టీయార్ అంత్యంత సన్నిహితుడు మృతి చెందారు. ఇంతకీ ఆయనెవరంటే..

Bose veerapaneni with Shobhan babu

సూపర్ స్టార్ కృష్ణ, వాణిశ్రీ కాంబినేషన్‌లో 'వింత కథ' చిత్రాన్ని తీసిన దర్శకుడు బోస్ వీరపనేని ఈ రోజు ఉదయం విజయవాడ‌లో కన్ను మూశారు. 'గ్రహణం విడిచింది'చిత్రానికి కూడా ఆయన దర్శకుడు. ఎన్టీఆర్‌కి సన్నిహితుడు‌గా పేరొందిన బోస్ మంగమ్మ శపథం,పుణ్యవతి కథానాయకుడు తదితర చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేశారు. బాపు దర్శకత్వం వహించిన సంపూర్ణ రామాయణం చిత్రానికి కో డైరెక్టర్ గా పని చేశారు. 80 ఏళ్ల బోస్ విజయవాడలో స్థిర పడ్డారు.

'వింత కథ' షూటింగ్ సమయంలో పై ఫొటోలో కళ్ళజోడు పెట్టుకుని గడ్డం కింద చేతులు పెట్టుకున్న వ్యక్తి.

ప్రముఖ కళా దర్శకుడు సూరపనేని కళాధర్ మేనల్లుడు బోస్. ఆయన విఠలాచార్య, బాపు, జి. విశ్వనాదం, దాదా మిరసి వంటి దర్శకుల దగ్గర 15 చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు. శోభన్ బాబు తో ఏరా అంటే ఏరా అనుకునేంత స్నేహం ఆయన సొంతం.

Also Read-Tollywood Stars: అందరు స్టార్స్ మాల్దీవుల్లోనే.. ఎం జరుగుతుందంటే

Also Read-Allu Arjun Fans: ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఆఫీస్‌పై ఫ్యాన్స్ దాడి.. పుష్ప 2

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 12 , 2024 | 12:37 PM