Ramam Raghavam: దిల్ రాజుని కంటతడి పెట్టించిన సినిమా..

ABN, Publish Date - Nov 03 , 2024 | 05:41 PM

తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ డ్రామాగా మంచి సందేశంతో తెరకెక్కిన చిత్రం ‘రామం రాఘవం’. నటుడు, కమెడియన్ ధనరాజ్ ఈ సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సముద్రఖని తండ్రిగా, ధనరాజ్ కొడుకుగా ఈ చిత్రంలో నటించారు. తాజాగా ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా షో వేయించుకుని చూసిన దిల్ రాజు కొన్ని సీన్లకు ఎమోషనల్ అయినట్లుగా తెలుస్తోంది.

Dil Raju watched Ramam Raghavam

తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ డ్రామాగా మంచి సందేశంతో తెరకెక్కిన చిత్రం ‘రామం రాఘవం’ (Ramam Raghavam). నటుడు, కమెడియన్ ధనరాజ్ ఈ సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సముద్రఖని తండ్రిగా, ధనరాజ్ కొడుకుగా ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారులు వీళ్ళిద్దరే కావడం విశేషం. అక్టోబర్ 2న ఈ సినిమా చర్లపల్లి సెంట్రల్ జైలులో ప్రీమియర్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. దాదాపు 2500 మంది ఖైదీలు ఈ సినిమాను చూసి భావోద్వేగానికి గురైనట్లుగా చిత్ర బృందం పేర్కొంది. ఇప్పుడీ సినిమాను ప్రత్యేకంగా చూసిన దిల్ రాజు (Producer Dil Raju) కూడా భావోద్వేగానికి లోనైనట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ సినిమా చూడాలన్న ఆసక్తి ప్రేక్షకులలో మొదలైంది.

Also Read- Narne Nithin: ఎన్టీఆర్‌ బావమరిది నిశ్చితార్థం


ధన్ రాజ్ డైరెక్ట్ చేసిన ‘రామం రాఘవం’ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు కోసం ప్రీమియర్ ప్రదర్శించారు. ఆయన ఒక్కడే కూర్చుని ఈ సినిమా మొత్తం చూశారని, రెండు మూడు చోట్ల కంటతడి పెట్టుకున్నట్లుగా తాజాగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఇంత బాగా ఈ సినిమాను తెరకెక్కించిన ధన్‌రాజ్‌‌పై దిల్ రాజు ప్రశంసలు కురిపించినట్లుగా తెలుస్తోంది. ఇంతకు ముందు వేణుతో ‘బలగం’ వంటి ఎమోషనల్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దిల్ రాజు.. ఇప్పుడు ధన్‌రాజ్ తెరకెక్కించిన ఈ ‘రామం రాఘవం’ చిత్రాన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

Also Read-Malavika Mohanan: టాలీవుడ్‌ ఎంట్రీనే ప్రధానం.. ప్ర‌భాసే కాపాడాలి


తమిళం, తెలుగు భాషల్లో తండ్రికొడుకుల ఎమోషనల్‌ జర్నీగా ‘రామం రాఘవం’ చిత్రాన్ని తెరకెక్కించారు. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పోలవరపు నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య, పృధ్వీ, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ‘విమానం’ దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథను సమకూర్చగా.. అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నారు. హైదరాబాద్, అమలాపురం, రాజమండ్రి, రాజోలు, చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి విడుదల చేయనున్నారు.

Also Read-యంగ్ చాప్ ఎన్టీఆర్‌కు నారా భువనేశ్వరి ఆశీస్సులపై వైవిఎస్ చౌదరి స్పందనిదే..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 03 , 2024 | 05:41 PM