Dil Raju: డే వ‌న్ క‌లెక్ష‌న్స్ ప‌రంగా ‘దేవర’ టాప్ 2లో నిలిచే ఛాన్సుంది

ABN, Publish Date - Sep 27 , 2024 | 08:26 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించారు. జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టించిన‌ ఈ సినిమాలో మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రిజల్ట్‌పై దిల్ రాజు, కళ్యాణ్ రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారు ఏమన్నారంటే..

Kalyan Ram and Dil Raju

డే వ‌న్ క‌లెక్ష‌న్స్ ప‌రంగా ‘దేవర’ (Devara) సినిమా టాప్ 2 మూవీ అయ్యేలా ఉందని అన్నారు నిర్మాత దిల్ రాజు. ఆయన ఈ సినిమాను నైజాంలో విడుదల చేశారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్, టాక్ వంటి విషయాల్లో చిత్ర టీమ్ హ్యాపీగా ఉంది. ఆ సంతోషాన్ని మీడియా సమావేశం నిర్వహించి మేకర్స్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో

Also Read- Devara Review: ‘దేవర’ మూవీ రివ్యూ

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) మాట్లాడుతూ.. టీమ్ అంతా దాదాపు 3 ఏళ్ల పాటు పడిన కష్టమే ఈ ‘దేవ‌ర’ సినిమా. ప్రేక్ష‌కులు చూపిస్తోన్న ఆద‌రాభిమానాల‌కు, ఇస్తున్న రికార్డ్ బ్రేకింగ్ క‌లెక్ష‌న్స్‌కు ధ‌న్య‌వాదాలు. నంద‌మూరి అభిమానుల‌కు మెమెప్పుడూ రుణ‌ప‌డి ఉంటాం. ఈ సినిమా కోసం క‌ష్ట‌ప‌డిన కొర‌టాల శివ‌కి థాంక్స్‌. శివ‌గారు రాసిన క‌థ‌కు సాబు సిరిల్‌ న్యాయం చేశారు. రెండేళ్లు క‌ష్ట‌ప‌డ్డారాయ‌న‌. ఎన్టీఆర్ ఇర‌గ‌దీశాడు. మాట‌ల్లేవు. నాకెంతో గ‌ర్వంగా ఉంది. త‌ను వ‌న్ మ్యాన్ షో చేశాడు. గూజ్ బ‌మ్స్ వ‌చ్చాయి. మ‌రోసారి అంద‌రికీ ధన్యవాదాలని తెలిపారు.

Also Read- Jr NTR: థ్యాంక్స్ శివ.. ఉద్వేగానికి గురైన తారక్


దిల్ రాజు (Dil Raju) మాట్లాడుతూ.. టాలీవుడ్ స్టార్ హీరో సినిమా వ‌స్తుందంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవ‌ర్‌సీస్‌లోనూ పండుగ వాతావ‌రణం ఉంటుంది. నేను రాత్రి షోకు వెళ్లాను. అసలు రాత్రంతా నిద్ర కూడా పోలేదు. అంత ఆతృత‌గా సినిమా కోసం ఎదురు చూశాను. ఈ సినిమాను ఆద‌రిస్తోన్న ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు. కొర‌టాల శివ‌ అండ్ టీమ్ మూడేళ్లు క‌ష్ట‌ప‌డ్డారు. ఎంటైర్ టీమ్ డైరెక్ట‌ర్‌గారికి అండ‌గా నిల‌బ‌డ్డారు. ఎన్టీఆర్‌గారిని రెండు గంట‌ల న‌ల‌బై నిమిషాలు అలా చూస్తుండిపోయారు. సినిమాలో టెంపో అలా మెయింటైన్ అవుతూ వ‌చ్చింది. బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీగా క‌లెక్ష‌న్స్ వ‌స్తున్నాయి. డే వ‌న్ క‌లెక్ష‌న్స్ ప‌రంగా టాప్ 2 మూవీ అయ్యేలా ఉంది. మేక‌ర్స్ ఆ వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తారు. ఈ సినిమా ఇంత పెద్ద విజ‌యాన్ని సాధించిందంటే కార‌ణం ఎన్టీఆరే. ఆయ‌న ప్రెజ‌న్స్ నుంచి ప్ర‌తి సీన్‌లో హోల్డ్ చేస్తూ వ‌చ్చారు. వ‌న్ మ్యాన్ షోగా సినిమాను నిల‌బెట్టారు. ఈ మూవీని నైజాంలో రిలీజ్ చేసే అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌ల‌కు, సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్ అని అన్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘దేవర’ (Devara). కొరటాల శివ దర్శకత్వం వహించారు. జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టించిన‌ ఈ సినిమాలో మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టించారు.

Also Read- Jani Master Case: షాకింగ్ ట్విస్ట్.. విచారణలో జానీ మాస్టర్ ఏం చెప్పారంటే..

Also Read- Harsha Sai: అసలెవరీ హర్షసాయి.. మరో మెగాస్టార్ అంటూ బిల్డప్ ఇచ్చిన వారంతా ఏమయ్యారు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 27 , 2024 | 08:26 PM