Devi Sri Prasad: పుష్ప2 ఫస్టాఫ్‌కే చప్పట్లు కొట్టాం.. బ్లాక్ బస్టర్స్ పక్కా

ABN, Publish Date - Oct 14 , 2024 | 07:39 PM

పుష్ప2 సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌లు సినిమాపై హైప్‌ను అమాంతం పెంచుతున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా ఈ చిత్ర సంగీత వ‌ర్శ‌కుడు దేవీ శ్రీ ప్ర‌సాద్‌ ఓ ఈవెంట్‌లో చెప్పిన మాట‌లు సినిమాపై అంచ‌నాల‌ను రెండు మూడింత‌లు రెట్టింపు చేసేలా ఉన్నాయి.

dsp

మూడేళ్ళుగా బన్నీ(Allu Arjun) ఫ్యాన్స్, యావ‌త్ దేశం ఎంతో అస‌క్తిగా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని ఎదురు చూస్తున్న చిత్రం పుష్ప 2( Pushpa 2). అనేక కారణాల వల్ల ఈ సినిమా షూట్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ క్రమంలో సినిమా రిలీజ్ డేట్ కూడా రెండు మూడు సార్లు మార్చారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే దర్శకుడు సుకుమార్(Sukumar) సినిమాని జెట్ స్పీడ్‌లో ముందుకు తీసుకెళ్తున్నాడు. ఓ వైపు గ్లిమ్స్‌, సాంగ్స్ అప్డేట్స్‌కి మంచి ఆదరణ లభించగా.. సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌లు సినిమాపై హైప్‌ను అమాంతం పెంచుతున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా ఈ చిత్ర సంగీత వ‌ర్శ‌కుడు దేవీ శ్రీ ప్ర‌సాద్‌ (Devi Sri Prasad) ఓ ఈవెంట్‌లో చెప్పిన మాట‌లు సినిమాపై అంచ‌నాల‌ను రెండు మూడింత‌లు రెట్టింపు చేసేలా ఉన్నాయి.

దేవీశ్రీ ప్ర‌సాద్ (Devi Sri Prasad) మాట్లాడుతూ.. పుష్ప2 ఫస్టాఫ్ స్కిప్ట్ విన్నప్పుడే నేను చంద్రబోస్ చప్పట్లు కొట్టాము.. పుష్ప2 (Pushpa2 The Rule) సినిమా బ్లాక్ బస్టర్స్ పక్కా.. సుకుమార్ రైటింగ్ అంతా బాగా రాశారు..‌ బన్నీ అధ్బుతంగా నటించారు.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా తగ్గేదేలె అని పుష్ప 2 వర్క్ షెడ్యూల్ ప్రకారం పూర్తయిపోతోంది, వెరే లాగ్వెంజ్ మ్యూజిషన్స్ ను ఫ్యాన్స్ కోరుకోవటంలో తప్పే లేదని, ప్రతి ఒక్కరు మనకు స్పూర్తి ని అందించేవారని, కానీ భాషపై పట్టు సాధించి అవగాహనతో చెస్తే మంచిది. ఓ సినిమా సక్సెస్ అయితే అందరికి క్రెడిట్ దక్కాలి.. తప్పు జరిగినా అందరిదే.. తెలుగు సినిమాకు ఆస్కార్ రావటం గర్వకారణం. మేము నాటు నాటు సాంగ్ ప్లే చేసుకుని డాన్స్ వేశాం. చంద్రబోస్ కీరవాణి గారి ప్రతిభకు తగ్గ పురస్కారం లభించింది. బన్నీ, నేను చిన్నప్పటి నుంచి స్నేహితులం.. మా‌ మాధ్య సెలెబ్రేటింగ్ జర్నీ ఉంది. మా‌ ఇద్దరికీ కూడా ఒకేసారి నేషనల్ అవార్డ్ వచ్చింది. ఆ విషయంపై బన్నీ ,అల్లు అరవింద్ గారు కూడా నా గురించి ప్రత్యేకంగా స్పందించారు. హర్ గర్ తిరంగా పాట చేసే నాకు అవకాశం లభించటం.. దానికి మోదీ గారు నుంచి ప్రశంసలు లభించాయి. ఓ సంగీత దర్శకుడికి అతని వర్క్ కు వచ్చే అప్లాజ్ ను మించి ఇంకేమి ఎక్కువ ఆనందం ఏముటుంది అంటూ ముడించారు.


ఇదిలాఉండ‌గా.. ఇప్ప‌టికే ఈ పుష్ప2 ది రూల్ (Pushpa2 The Rule) చిత్రాన్ని డిసెంబర్ 6న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన‌ నేపథ్యంలో షూటింగ్‌లో వేగం పెంచిన దర్శకుడు సుకుమార్.. ఫస్ట్ హాఫ్ ఎడిట్ కాపీని లాక్ చేశారు. ఇక సెకండ్ హాఫ్ లో మిగిలి ఉన్న కొన్ని సన్నివేశాల షూట్ కోసం మూడు యూనిట్లు పనిచేస్తున్నాయి. ఇందులో ఒక యూనిట్ రంపచోడవరంలో పని చేస్తుండగా మరో రెండు యూనిట్లు వైజాగ్, యానాంలో పని చేస్తున్నాయి. ఎట్టకేలకు సినిమా రిలీజ్ దగ్గరపడటం, షూటింగ్ చకచకా సాగుతుండటం అభిమానులలో జోష్ పెరిగింది.

Updated Date - Oct 14 , 2024 | 07:54 PM