Jr Ntr: దేవ‌ర ప‌లుకు.. ఆ త‌ప్పు అస‌లు చేయ‌కండి

ABN, Publish Date - Sep 25 , 2024 | 12:59 PM

దేవ‌ర సినిమా విడుద‌ల నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం అదేశాల మేర‌కు డ్ర‌గ్స్ ర‌హిత స‌మాజం కోసం తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా జూనియ‌ర్ ఎన్టీఆర్ పిలుపునిచ్చారు.

devara

తెలంగాణ రాష్ట్రంలో కొత్త‌గా థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కు రెడీగా ఉన్న‌ సినిమాల‌కు సంబంధించి టికెట్ రేట్లు పెంచుకునేందుకు స‌ర్కార్ దగ్గ‌రికి వ‌చ్చే ప్రొడ్యూస‌ర్స్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కొన్ని షరతులు విధించిన విషయం తెలిసిందే. దీని ప్ర‌కారం ఇకపై ప్రతి సినిమాకు ముందు సైబర్‌ క్రైమ్‌, డ్రగ్స్ (Drugs)పై అవగాహన కల్పించేలా వీడియోలు చేయాలనే షరతు పెట్టారు.

ఈక్రమంలో మ‌రో రెండు రోజుల్లో జూ. ఎన్టీఆర్ (Jr Ntr) దేవ‌ర సినిమా విడుద‌వుతున్న క్ర‌మంలో టికెట్ రేట్ల పెంపుద‌ల కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ప్ర‌త్యేక అనుమ‌తులు ఇవ్వ‌డం, జీవోలు కూడా జారీ చేశారు. ఈ నేప‌థ్యంలో డ్ర‌గ్స్ (Drugs) ర‌హిత స‌మాజం కోసం తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా జూనియ‌ర్ ఎన్టీఆర్ (Jr Ntr) పిలుపునిచ్చారు. ఎంతో మంది యువత డ్రగ్స్‌కు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్‌మీడియాలో బాగా చ‌క్క‌ర్లు కొడుతుంది.

Updated Date - Sep 25 , 2024 | 12:59 PM