Devara: భయం చూపించడానికి రెడీ!

ABN, Publish Date - Aug 28 , 2024 | 10:25 AM

దేవర’ (Devara)రిలీజ్‌ కౌంట్‌డౌన్‌ మొదలైంది. భయం అంటే ఎలా ఉంటుందో చూపించడానికి 'దేవర' రెడీ అవుతున్నాడు


దేవర’ (Devara)రిలీజ్‌ కౌంట్‌డౌన్‌ మొదలైంది. భయం అంటే ఎలా ఉంటుందో చూపించడానికి 'దేవర' రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్‌ (jr ntr) కథానాయకుడిగా కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సముద్రతీర ప్రాంతం నేపథ్యంలో సాగుతుంది.   రెండు భాగాలుగా రూపొందుతున్న సంగతి తెలిసిందే! మొదటి పార్ట్‌ సెప్టెంబర్‌ 27న విడుదల చేయనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకుని, నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుపుకొంటుంది. ఈ సందర్భంగా గా మంగళవారం కౌంట్‌డౌన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ‘భయం రూపాలు’ అనే వ్యాఖ్యతో రెండు లుక్స్‌లో కనిపిస్తున్న ఎన్టీఆర్‌ పోస్టర్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేశారని ఈ పోస్టర్‌ చెబుతోంది. ఎన్టీఆర్‌కి జోడీగా జాన్వీ కపూర్‌ నటించారు. సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పణలో, సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

Updated Date - Aug 28 , 2024 | 10:26 AM