N convention: నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత
ABN, Publish Date - Aug 24 , 2024 | 10:47 AM
అక్కినేని నాగార్జునకు (Akkineni Nagarjuna) చెందిన ఎన్ కన్వెన్షన్ (N-Convention) సెంటర్‌ను హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మోనిటరింగ్ ప్రొటెక్షన్ -HYDRA) బృందం కూల్చివేస్తోంది.
అక్కినేని నాగార్జునకు (Akkineni Nagarjuna) చెందిన ఎన్ కన్వెన్షన్ (N-Convention) సెంటర్‌ను హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మోనిటరింగ్ ప్రొటెక్షన్ -HYDRA) బృందం కూల్చివేస్తోంది. హైటెక్ సిటీకి సమీపంలో ఉన్న ఈ కన్వెన్షన్ సెంటర్‌ను భారీ బందోబస్తు మధ్య కూల్చివేతను అధికారులుని చేపట్టారు. తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని చాలాకాలంగా ఆరోపణలు ఉన్నాయి. మూడున్నర ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్‌ను నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైడ్రా తీసుకొచ్చారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించడం, చెరువులను పరిరక్షించడం, విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండటం హైడ్రా ముఖ్య లక్ష్యాలు. ప్రస్తుతం ఇది ఇది కబ్జాదారుల్లో వణుకు పట్టిస్తోంది. (Ne convention Demolition)
అయితే గత ప్రభుత్వం హయాంలోనూ ఎన కన్వెన్షన్ సెంటర్ అక్రమంగా నిర్మించారనే ఆరోపణలు వచ్చాయి. పూర్తిగా ఆక్రమణ ద్వారా కట్టిందే అయినా వెనక ఉన్న చెరువులో కొంత భాగం మాత్రమే కబ్జాకు గురైందని, వెంటనే చర్యలు తీసుకుంటామని హడావిడి చేశారు. అయితే కొన్నాళ్లకు ఆ విషయమే కనుమరుగైంది. ప్రస్తుత ప్రభుత్వం, అధికారులు ఈ కబ్జా గురించి మరోసారి తెరపైకి తీసుకొచ్చి కూల్చివేత మొదలుపెట్టారు.