Sangharshana: ఆగస్టు 9న థియేటర్లలోకి.. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సంఘర్షణ
ABN, Publish Date - Jul 29 , 2024 | 03:08 PM
చైతన్య పసుపులేటి, రషీద భాను మెయిన్ లీడ్ గా నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ సంఘర్షణ. ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్ట్ 9న థియేటర్లలో విడుదలయ్యేందుకు రెడీగా అయింది.
చైతన్య పసుపులేటి (Chaitanya Pasupuleti), రషీద భాను (Rasheed Bhanu) మెయిన్ లీడ్ గా నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ సంఘర్షణ (Sangharshana).
మహీంద్ర పిక్చర్స్ (Mahindra Pictures) ప్రొడక్షన్ నెంబర్ 1 మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు చిన్న వెంకటేష్ (Chinna Venkatesh) దర్శకత్వం వహిస్తుండగా వల్లూరి.శ్రీనివాస రావ్ (Valluri Srinivasa Rao) తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు.
ఇప్పుడీ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్ట్ 9న థియేటర్లలో విడుదలయ్యేందుకు రెడీ అయింది.
లవ్, ఫ్యామిలీ ఇతివృత్తంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా అన్ని రకాల ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ సినిమాకు ఆదిత్య శ్రీ రామ్ (Adithya Sri Ram) స్వరాలు సమకూర్చగా, సుధాకర్ (Sudhakar), కేవీ ప్రసాద్ (KV Prasad) సినిమాటోగ్రఫీ అందించారు. వన్ మీడియా ద్వారా పార్థు రెడ్డి (Parthu Reddy) ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు.